ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ నడవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాకింగ్ కీలక పాత్ర పోసిస్తుందని, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వాకింగ్‌తో చెక్ పెట్టొచ్చు.
అయితే నడక మంచిదని అందరికీ తెలిసిదే కానీ ఏ వయసు వారు ఎంత సేపు నడవాలన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ వయసు వారు, ఎంత దూరం వాకింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌కి వెళ్లడం లేదా యోగా చేయడం కంటే నడకను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ కచ్చితంగా కొంత దూరమైన నడవాలని సూచిస్తుంటారు. నడక బెస్ట్ ఎక్సర్‌సైజ్‌గా చెబుతుంటారు. నడక మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది. అయితే ఒక రోజులో ఎంతసేపు నడవాలి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పరిశోధకులు అభిప్రాయం ప్రకారం ఏ వయసు వారు ఎంత సేపు నడవాలో ఇప్పుడు చూద్దాం.
స్వీడన్‌లోని కోల్‌మార్ విశ్వవిద్యాలయంలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడవాలి. ఎందుకంటే ఇది బరువును అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో, జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని ఈ అధ్యయనంలో తెలిపారు. దీని ప్రకారం.. 6 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న వారు రోజుకు కనీసం 15 వేల అడుగులు నడవాలి. అయితే అమ్మాయిలు 12 వేల అడుగులు నడవాలని పరిశోధకులు చెబుతున్నారు.
అలాగే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు స్త్రీ, పురుషులు ఇద్దరూ రోజుకు కనీసం 12 వేల అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 40 ఏళ్లు పైబడిన వారిలో సహజంగానే ఆరోగ్య సంబధిత సమస్యలు మొదలవుతాయి, కాబట్టి ఈ వయసులో వారు రోజుకు 11 వేల అడుగులు నడవాలి. 50 ఏళ్లు పైబడిని వారు రోజుకు 10 వేల అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 60 ఏళ్లు పైబడిన వాళ్లు రోజుకు 8 వేల అడుగులు నడిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.