Limited Offer: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆఫర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త ఫోన్ లాంచ్ అయినా ప్రైస్ తగ్గినప్పుడు కొందామనుకుంటున్నాడు. ఇందుకోసం ఆఫర్ల కోసం వెతికేస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెజాన్ ఇండియాలో మరో సేల్‌ను తీసుకొచ్చింది. అమేజింగ్ లిమిటెడ్ టైమ్ డీల్ ప్రకటించింది.ఈ సేల్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
మీరు 64 మెగాపిక్సెల్ OIS కెమెరాతో Vivo ప్రీమియం ఫోన్ Vivo Y200 5Gని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,999. ఈ డీల్‌లో దీనిపై రూ. 750 కూపన్ తగ్గింపు లభిస్తుంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి HDFC లేదా SBI కార్డును ఉపయోగిస్తే మీకు రూ.1500 డిస్కౌంట్ అందిస్తోంది. ఫోన్‌పై రూ.1150 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. మీరు ఈ ఫోన్‌ని సులభమైన EMIలో కూడా దక్కించుకోవచ్చు.
Vivo Y200 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఈ Vivo ఫోన్‌లో మీరు 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను చూస్తారు. ఈ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 8 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది.
ఇది 64-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అదే సమయంలో కంపెనీ సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చింది. ఫోన్‌లో 4800mAh బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. సేఫ్టీ పరంగా మీరు ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. OS గురించి మాట్లాడితే ఈ ఫోన్ Android 13తో Funtouch OS 13పై పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం మీకు ఫోన్‌లో 5G, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, USB 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.