ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రూ. లక్ష వరకు రుణం….ఈ పథకానికి ఎవరు అర్హులు? దీని వల్ల ఎలా ప్రయోజనం పొందుతారు?

పీలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.


డ్వాక్రా గ్రూపులోని మహిళల పిల్లల విద్యకు భరోసా కల్పించేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’అనే పేరుతో మరో పథకాన్ని శ్రీకారంచుట్టింది. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఉంటే వారికి అతి తక్కువ వడ్డీతో రుణం కల్పించే విధంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. డ్వాక్రా మహిళలకు లోన్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు చదువుకుంటున్న పిల్లలను కలిగి ఉన్నవారు ఆ విద్యార్థుల విద్య సక్రమంగా కొనసాగించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆ మహిళలకు నాలుగు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాని నిర్ణయించింది. పిల్లలను చదివేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా , వారు అధిక వడ్డీతో ప్రైవేట్ సంస్థల వద్ద , వ్యక్తులు వద్ద రుణాలను తీసుకుని అప్పుల ఊబిలోకి పోకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రమ గతమైన లోన్ మంజూరు చేయడం ద్వారా వారికి భరోసా కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)విభాగం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి నోడల్ డిపార్ట్మెంట్‌గా పని చేస్తోంది. ముఖ్య సమాచారంరుణం మంజూరు: రూ.10 వేలు నుంచి రూ.లక్ష రూపాయల వరకు వడ్డీ: నాలుగు శాతం వడ్డీ(35పైసలు)చెల్లింపులు: రుణ మెుత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలిగడువు: 24 నుంచి 36 నెలల వ్యవధిలో రుణం మెుత్తాన్ని చెల్లించాలి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం యొక్క విధి విధానాలు

1.లోన్ తీసుకోవాలనుకునే మహిళలు ఖచ్చితంగా డ్వాక్రా సంఘాలలో సభ్యురాలై ఉండాలి. డ్వాక్రా సంఘంలోని సభ్యులుగా ఉన్న మహిళల పిల్లలు చదువుకుంటే వారికి లోన్ వచ్చే అవకాశం.

2.విద్యార్థులు ఒకటవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్య చదువుతూ ఉండాలి.

3.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు… కళాశాలలో ఎక్కడ చదివినా ఈ పథకానికి అర్హులే.

4.స్త్రీనిధి కార్యక్రమానికి అనుసంధానంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రూ.10వేల నుంచి లక్ష రూపాయలు వరకు రుణం మంజూరు అవుతుంది. వడ్డీ కేవలం 4శాతం మాత్రమే.

5.రుణాన్ని కనీసం 24 నెలలలో గరిష్టంగా 36 నెలల్లోగా వాయిదాల రూపంలో చెల్లించాలి.

6.లోన్‌ను కేవలం విద్యార్థుల యొక్క విద్యకు సంబంధించిన అంశాలు అయిన యూనిఫామ్ , పుస్తకాలు , ఫీజు చెల్లింపులు , విద్యకు సంబంధించిన ఇతర అంశాలకు మాత్రమే ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన రశీదులు సైతం అధికారులకు ఇవ్వాలి.

7.విద్యార్థుల రవాణా సౌకర్యం నిమిత్తం సైకిల్ కొనుగోలుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

8.ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు SERP అధికారులను డ్వాక్రా స్త్రీ నిధి అధికారులను సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.