తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఎస్ఈసీ రాణికుముదిని వెల్లడించారు.
31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుండగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు.

































