టాలీవుడ్‌లో తమ అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్‌లో సితార ఒకరు. సితార 1986లో మలయాళ చిత్రం కావేరితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.ఈ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా 1989లో తమిళ చిత్రం పుదు పుదు అర్థంగల్తో తమిళ ల్లోకి ప్రవేశించారు. ఇక తెలుగులో 1990లో మనసు మమత చిత్రంతో పరిచయమయ్యారు సితార. ఆ తర్వాత జీవన చదరంగం, గంగ, శ్రీవారి చిందులు, శుక్రవారం మహాలక్ష్మి, మా వారికి పెళ్ళి, అక్క చెల్లెళ్ళు వంటి చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో సహా 100కు పైగా ల్లో నటించారు, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వివిధ పాత్రలు పోషించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ లో ఆయన చెల్లెలిపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ ఆనే నేను, బృందావనం, అరవింద సమేత, లెజెండ్ ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్న సితార ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు.
సితార వయస్సు ప్రస్తుతం 52 ఏళ్ళు, ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. ఒక ఇంటర్వ్యూలో, ఆమె తన తండ్రి మరణం తర్వాత పెళ్లి గురించి ఆలోచించలేదని, అలాగే తన సన్నిహిత స్నేహితుడు, తమిళ నటుడు మురళి మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయానని చెప్పారు. ఈ రెండు సంఘటనలు ఆమె జీవితంలో పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండడానికి కారణమని ఆమె వెల్లడించారు. ఆమె తన తల్లిదండ్రులతో ఉండాలనే ఆలోచన, సినీ రంగంలో బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు సితార.