వంటలు టేస్టీగా ఉండేందుకు రకరకాల మసాలాలు వాడటం సహజం. కూరలు రుచికరంగా వండేందుకు దాదాపు అందరూ ఫాలో అయ్యేది ఇదొక్కటే.
తక్కువ టైంలో వంట రుచిగా రావాలి అనుకున్నప్పుడు ఇదే పద్ధతి అనుసరిస్తారు. అయితే, చాలామంది బయట కొన్న మసాలా పొడులనే అధికంగా వాడుతుంటారు. ఇలాంటప్పుడు అన్ని రకాల మసాలాలు తగినంత మోతాదులో వేయకపోతే కోరుకున్న రుచి రాకపోవచ్చు. అందుకు బదులుగా ఈ ఒక్క మ్యాజిక్ మసాలా (MASALA MAGIC POWDER RECIPE) వాడితే ఏ కూరైనా సూపర్ టేస్టీగా మారిపోవాల్సిందే. ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ మసాలా పొడితో రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం దక్కుతాయి.
మార్కెట్లో దొరికే అన్ని మసాలాలు ఆరోగ్యానికి మంచివని గ్యారెంటీగా చెప్పలేం. కల్తీవి కూడా ఎక్కువగా అమ్మేస్తుంటారని అందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లోనే సులభంగా ఈ మసాలా తయారుచేసుకుంటే ఏ ఆందోళనా ఉండదు. పైగా, టేస్ట్ కోసం రకరకాల పొడులు వేయాల్సిన అవసరం లేకుండా ఇదొక్కటే వేసుకోవచ్చు. మరి, దీన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
ధనియాలు – 1/4 కప్పు
జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు
మెంతులు – పావు చెంచా
లవంగాలు – 6
యాలకులు – 4
దాల్చినచెక్క – ఒక ముక్క
వెల్లుల్లి పొడి – అర చెంచా
మిరియాలు – అర చెంచా
పసుపు – అర టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు – 2
ఉప్పు – రుచికి సరిపడా
ఆమ్‌చూర్ పొడి – చెంచా
ఆనియన్ పౌడర్ – చెంచా
సోంపు – చెంచా
డ్రై జింజర్ పొడి – అర చెంచా
కారం – 1 టేబుల్ స్పూన్
మొక్కజొన్న పిండి- అర టేబుల్ స్పూన్
పంచదార – చెంచా
పిండి – అర టేబుల్ స్పూన
తయారీ విధానం :
ముందుగా స్టౌపై కడాయి పెట్టి ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి చిన్నమంటపై 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఓ ప్లేటోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో పసుపు, పంచదార, ఉప్పు, ధనియాల పొడి, ఆనియన్ పౌడర్, ఆమ్‌చూర్, డ్రై జింజర్ పొడి, వెల్లుల్లి పొడి, మొక్కజొన్న పిండి అన్నీ కలిపి మెత్తగా అయ్యే వరకూ మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత మూత తీసి పొడి తడిపోయేవరకూ 10 నిమిషాలు ఆరబెట్టండి. రెడీ అయిన మసాలా పొడిని గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కూరలోనైనా తగినంత మోతాదులో వేసుకోవడం మర్చిపోకండి.
వెయ్యేళ్లనాటి పాలగారెలు
పనీర్… పారాహుషార్
మామిడిముక్కలతో చేపల పులుసు