పట్టణ పాఠశాలలకు మహర్దశ

రాష్ట్ర ప్రభుత్వం పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించేందుకు ఆమోదం తెలపడంతో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.


కొన్నేళ్లుగా ఉన్న ఉపాధ్యాయుల కొరత ఇబ్బంది తీరనుంది. పదో తరగతి ఫలితాల్లో మున్సిపల్‌ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా ఇన్‌చార్జి హెచ్‌ఎంలతో నెట్టుకొస్తున్న పాఠశాలలకు పూర్తిస్థాయిలో హెచ్‌ఎంలు రానున్నారు. మునిసిపల్‌ పాఠశాలల్లో గత 17 ఏళ్లుగా ఉపాఽధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని మున్సిపల్‌ పాఠశాలలు 39, నంద్యాల మున్సిపాలిటీలో 39 పాఠశాలలు ఉండగా కర్నూలు కార్పొరేషన్‌ 52 పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

విద్యా వలంటీర్లతో

సబ్జెక్టు టీచర్ల కొరత ఉండటంతో విద్యా వలంటీర్లు లేకుంటే ఇతర పాఠశాలల నుంచి ఎస్జీటీలను డిప్యూటేషన్‌పై నియమించి విద్యార్థు లకు బోధన అందిస్తున్నారు. పూర్తిస్థాయి హెచ్‌ఎం లు, పీఈటీలులేఏక ఇబ్బంది పడుతున్నారు.

అప్‌గ్రేడ్‌ పాఠశాలకు హెచ్‌ఎంలు

పట్టణంలోని ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యి ఆరేళ్లవుతోంది. దా దాపు 700 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. ఇక్కడ కేవలం నలుగురితో మాత్రమే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో ఉపాఽధ్యాయులతో పాటు ప్రధానోపా ధ్యాయుడు కూడా రానున్నారు. కిల్చిన్‌ పేట పురపాలక ఉన్నత పాఠశాల, ఆస్మియా ఉర్దూ ఉన్నత పాఠశాలకు హెచ్‌ఎంలు రానున్నారు. నం ద్యాలలోని వైఎస్సార్‌ కాలనీలో పురపాలక ఉన్నత పాఠశాల, నడిగట్టు మసూదియా ఉన్నత పాఠశా లకు హెచ్‌ఎం పోస్టులు మంజూరయ్యాయి. దీంతో ప్రధానాపోధ్యాయులతో పాటు సబ్జెక్టు టీచర్ల కొరత కూడా ఇక ఉండదు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి

రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. దీంతో అవసరమైన చోట ఉపాధ్యాయుల కు పదోన్నతులు కల్పించి పూర్తి స్థాయిలో నియమించుకునేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేడ్‌ టూ హెచ్‌ఎం పోస్టులు కూడా భర్తీ కానున్నాయి. ఆదోని, మునిసిపాలిటీ పరిధిలో 115 పోస్టులు భర్తీ కానున్నాయి. అలాగే అవసరమున్న ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. బదిలీల అనంతరం వారంలో షెడ్యూల్‌ ద్వారా ఈ కార్యక్ర మాన్ని నిర్వహిం చేందుకు విద్యాశాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది.

పోస్టులు మంజూరు హర్హణీయం

17 ఏళ్ల తర్వాత ఉపాఽధ్యాయ పోస్టుల మంజూరుతో పాటు పదోన్నతి కల్పించడం హర్షణీ యం. పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు ఇది తోడ్పడ నుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చొరవ తీసుకుని మునిసిపల్‌ పాఠశాలల్లో పదోన్నతులు కల్పించడం అభినందనీయం. – వి రమేష్‌ నాయుడు, ఎస్టీయూ పురపాలక కమిటీ సభ్యుడు ఆదోని

బదిలీల అనంతరం పదోన్నతులు

ఉమ్మడి జిల్లాలోని అన్ని పురపాలక పాఠశాలలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించేందుకు ఆమోదం తెలిపింది. ఎస్జీటీటీలకు పదోన్నతి కల్పించి హైస్కూళ్లలో ఉన్న సబ్జెక్టు టీచర్ల కొరత తీరుస్తాయి. బదిలీలు పూర్తయిన వెంటనే పదోన్నతి కల్పిస్తాం. పూర్తిస్థాయిలో హెచ్‌ఎంలను నియమిస్తాం. – ఎస్‌.శామ్యూల్‌ పాల్‌, డీఈవో, కర్నూలు