మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా

సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజ‌మౌళి అప్ కమింగ్ మూవీ పై ప్రేక్షకులకు బోలెడు అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ హిట్ త‌రువాత ఫుల్ ఫామ్ లో ఉన్న జ‌క్క‌న్న‌ ఇప్పుడు మహేష్ బాబు తో మూవీ అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు వరసహిట్లతో దూకుడు మీద ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరుకారం ఇలా హిట్లమీద హిట్లు కొట్టుకొని పోతూ ఇప్పుడు మూవీలు చేస్తున్నారు.


అయితే ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. నాకు తెలుగు చదవడం, రాయడం రాదని మహేష్ తెలిపారు. డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ ను విని తాను డైలాగులను చెబుతానని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మహేష్ చెప్పిన ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా దర్శకుడు కొరటాల శివ ఒక సందర్భంలో మాట్లాడుతూ, మహేష్ మెమొరీ అద్భుతం అని రెండుసార్లు డైలాగు వింటే మహేష్ కు ఆటోమేటిక్ గా గుర్తుంటుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

ఈ కాంబినేషన్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి హిట్ కావడంతో పాటు అటు మహేష్ కు ఇటు కొరటాల శివకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని మహేష్ బాబు సినిమాలకే పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.