నీట్ 2025 ఫలితాల్లో టాప్‌ మహేష్ కుమార్- మొదటి పది స్థానాలు అబ్బాయిలవే

నీట్ ఫలితాలు 2025లో 12 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీళ్లంతా MCC, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ రౌండ్లలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది.


టాప్ ర్యాంకులు సాధించిన వారి జాబితా చూస్తే టాప్ టెన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇందులో 9 మంది అబ్బాయిలే. ఒక్కరే అమ్మాయి ఉన్నారు.

1. మహేష్ కుమార్ – ర్యాంక్ 1 (రాజస్థాన్)
2. ఉత్కర్ష్ అవధియా – ర్యాంక్ 2(మధ్యప్రదేశ్ )
3. క్రిషాంగ్ జోషి – ర్యాంక్ 3( మహారాష్ట్ర)
4. మృణాల్ కిషోర్ ఝా – ర్యాంక్ 4( ఢిల్లీ)
5. అవికా అగర్వాల్ – ర్యాంక్ 5(ఢిల్లీ )
6. జెనిల్ వినోద్ భాయ్ భయాని – ర్యాంక్ 6(గుజరాత్)
7. కేశవ్ మిట్టల్ – ర్యాంక్ 7( పంజాబ్)
8. ఝా భవ్య చిరాగ్ – ర్యాంక్ 8(గుజరాత్ )
9. హర్ష్ కేదావత్ – ర్యాంక్ 9( ఢిల్లీ)
10. ఆరవ్ అగర్వాల్ – ర్యాంక్ 10(మహారాష్ట్ర)

ఈసారి పేపర్ చాలా కఠినంగా రావడంతో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్కు 686 మార్కులు వచ్చాయి. తర్వాత 628 మార్కులు దాదాపు 237 మందికి వచ్చాయి. 577 మార్కులు 4వేల మందికి వచ్చాయి. 568 మార్కులు 6వేల మందికి వచ్చాయి. 561 మార్కులు 8వేల మందికి వచ్చాయి. 552 మార్కులు 11 వేల మందికి వచ్చాయి. 544 మార్కులు 15 వేల మందికి వచ్చాయి. 535 మార్కులు వచ్చిన వాళ్లు 21 వేల మంది ఉంటే, 526 మార్కులు వచ్చిన వాళ్లు 26 వేల మంది ఉన్నారు.

కేటగిరి వైజగ్గా పరీక్షలు రాసిన అభ్యర్థుల జాబితా చూస్తే
ఓసీ కేటగిరిలో 6,89,366 మంది అభ్యర్థులు పరీక్షను రాశారు.
ఎస్సీ కేటగరిలో 3,49,825 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఎస్టీ కేటగిరిలో 1,50,024 మంది పరీక్షకు వచ్చారు.
ఓబీసీ కేటగిరిలో చూస్తే 10,97,388 మంది పరీక్షను అటెంప్ట్ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జాబితాలో 1,54,326 మంది పరీక్షను రాశారు.

ఈ ఫలితాలను ఎన్టీఏ వివిధ ప్లాట్ఫామ్లలో పెట్టంది. exams.nta.ac.in/NEET-UG nta.ac.in, Digilocker app and website (digilocker.gov.in), Umang appలో కూడా ఫలితాలను ఉంచింది. వీటిలో ఎక్కడైనా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

పరీకక్షకు హాజరైన అభ్యర్థులంతా తమ మెయిల్స్ను చెక్ చేయాలి. ఫలితాల స్కోర్ కార్డ్ను అప్లికేషన్ నింపినప్పుడు ఇచ్చిన మెయిల్కు పంపిస్తారు. ఈ స్కోర్ల ఆధారంగా అభ్యర్థులను కౌన్సెలింగ్కు పిలుస్తారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సాధారణంగా జులైలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంచనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.