Mahindra XUV 3XO: మహీంద్రా మాస్ – గంటలో 50 వేల బుకింగ్స్ కొట్టిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో!

www.mannamweb.com


Mahindra XUV 3XO Record Bookings: మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో బుకింగ్స్ నేడు (బుధవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. మొదలైన మొదటి 60 నిమిషాల్లోనే ఏకంగా 50,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్లను మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో పొందడం విశేషం.

మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో దేశవ్యాప్తంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. మొదటి 10 నిమిషాల్లోనే ఏకంగా 27 వేల బుకింగ్లను నమోదు చేసింది. ఇది మహీంద్రా కొత్త ఎస్యూవీపై కస్టమర్ల అద్భుతమైన ఉత్సాహాన్ని చూపుతుంది. ఈ విజయం ఎక్స్యూవీ 3ఎక్స్వో అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన రైడ్, అధునాతన సాంకేతికత, థ్రిల్లింగ్ పనితీరు, సాటిలేని భద్రతను ప్రతిబింబిస్తుంది.

కలర్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి?
ఈ ఎస్యూవీ గెలాక్సీ గ్రే, రెడ్, డూన్ బీజ్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ ప్లస్ గాల్వనో గ్రే, ఎవరెస్ట్ వైట్ ప్లస్ స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే ప్లస్ స్టెల్త్ బ్లాక్, స్టెల్త్ బ్లాక్ ప్లస్ గాల్వనో గ్రే, టాంగో రెడ్ ప్లస్ వంటి 16 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లాక్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, నెబ్యులా బ్లూ, డీప్ ఫారెస్ట్ ప్లస్ గాల్వనో గ్రే, డూన్ బీజ్ ప్లస్ స్టెల్త్ బ్లాక్, సిట్రిన్ ఎల్లో, సిట్రిన్ ఎల్లో ప్లస్ స్టెల్త్ బ్లాక్ రంగుల్లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇంజిన్, మైలేజీ ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో ఇప్పటికే ఉన్న పెట్రోల్ ఇంజన్ (130 పీఎస్/230 ఎన్ఎం) లాగా అదే పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను పొందుతుంది. అన్ని ఇంజన్లు ప్రామాణికంగా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మార్కెట్లోకి రానున్నాయి. రెండు పెట్రోల్ ఇంజన్లు ఆప్షనల్గా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని పొందుతాయి. అయితే డీజిల్ యూనిట్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లీటరుకు 17.96 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 20.1 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్-8 పెట్రోల్, 1.2 లీటర్ టీజీ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు 20.6 కిలోమీటర్ల మైలేజీని, 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 21.2 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నాయి.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వోలో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్, మరొకటి ఇన్స్ట్రుమెంటేషన్ కోసం), క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ పనోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి కొన్ని అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి.