Majjiga Charu Benefits in Telugu :వారంలో 2 సార్లు మజ్జిగ చారు తింటే ఊహించని లాభాలు ఎన్నో…ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి ఆహారం,మంచి నిద్ర అవసరం.
శరీరంలో రోగనిరోధక శక్తి కూడా చాలా అవసరం. అప్పుడే ఏ వైరస్ బారిన పడకుండా ఉంటాం. మజ్జిగచారుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వారంలో రెండు సార్లు మజ్జిగచారు తింటే మంచిది.
వంటగదిలో అందుబాటులో ఉండే వస్తువులతో తయారుచేసే మజ్జిగచారులో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి చాలా మేలును చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
పెరుగు లేదా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా రెట్టింపు శాతంలో ఉంటుంది.ఈ బ్యాక్టీరియా పేగుల్లోని చెడు బ్యాక్జీరియాను చంపేసి శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు రాకుండా రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది.
మన పెద్దవారు ఎక్కువగా మజ్జిగ చారు ఇంటిలో చేసేవారు. ఇప్పటి తరానికి మజ్జిగ చారు గురించి పెద్దగా తెలియదు. మజ్జిగ చారును ప్రాంతాన్ని బట్టి రకరకలుగా చేసుకుంటారు.
మజ్జిగలో ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు మరియు వెల్లుల్లి చితకొట్టి వేస్తారు. కాస్త ఉప్పు,జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఈ మజ్జిగచారు చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మజ్జిగ చారు చేసుకొని తినండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.