టేస్టీ పీనట్‌ బటర్‌.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

చాలా మందికి వేరుశెనగ వెన్న (పీనట్‌ బటర్‌) అంటే చాలా ఇష్టం. మార్కెట్లో దీనిని కొనుగోలు చేసిన వేరుశెనగ వెన్న ఖరీదెక్కువ. పైగా ఇందులో రసాయలనాల కారణంగా ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అయితే దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి వేరుశెనగ వెన్న ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..


ముందుగా వేరుశెనగ వెన్న తయారీకి అవసరమైన పదార్థాలను తెలుసుకోవాలి. వేరుశెనగలు (పచ్చి లేదా వేయించినవి) – 2 కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, తేనె/చక్కెర – 1 లేదా 2 స్పూన్లు, నూనె (వేరుశెనగ లేదా ఏదైనా నూనె) – 1 లేదా 2 స్పూన్లు తీసుకోవాలి.

మీరు పచ్చి వేరుశనగలు తీసుకుంటే వాటిని మీడియం మంట మీద పాన్‌లో తేలికగా వేయించాలి. వాటిని చల్లారనిచ్చి తొక్క తీసేయాలి. వేయించిన వేరుశనగలను మిక్సర్/బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. తొలుత అవి పొడిలా ఉంటాయి. కొంత సమయం తర్వాత నూనె బయటకు వచ్చి పేస్ట్‌గా మారుతుంది.

రుచికి ఉప్పు, తేనె లేదా చక్కెర జోడించాలి. ఇది చాలా మందంగా అనిపిస్తే, 1 లేదా 2 టీస్పూన్ల నూనె జోడించాలి. ఆ తర్వాత క్రీమీ అయ్యే వరకు మళ్లీ బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేస్తే సరిపోతుంది. ఈ వేరుశెనగ వెన్న గది ఉష్ణోగ్రత వద్ద 1 లేదా 2 వారాలు, రిఫ్రిజిరేటర్‌లో 1 నెల పాటు నిల్వ ఉంటుంది.

మీకు క్రంచీ పీనట్ బటర్ కావాలంటే కొన్ని పీనట్ లను ముతకగా రుబ్బి చివర్లో కలపాలి. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. కాబట్టి ఇది ఆరోగ్యకరమైనది. పీనట్ బటర్ తినడం వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగవచ్చు. మీరు ఫిట్‌నెస్ డైట్‌లో బ్రెడ్/టోస్ట్‌పై, శాండ్‌విచ్‌లలో, పాలు లేదా అరటిపండు స్మూతీలలో పీనట్‌ బటర్‌ తీసుకోవచ్చు. జిమ్/వ్యాయామానికి వెళ్లేవారికి పెకాన్ బటర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.