చాలామంది బీరకాయలను అంత ఇష్టంగా తినరు. కానీ బీరకాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. బీరకాయలలో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. బీరకాయలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.
బీరకాయలలో ఫుల్ పోషకాలు బీరకాయలలో విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బీ 6, పొటాషియం, సోడియం, ఐరన్, జింక్, కాపర్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక బీరకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
బీరకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బీరకాయలో ఉండే పోషకాలు మన శరీరంలోని వ్యర్ధాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. బీరకాయ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయలో ఉండే పుష్కలమైన విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాల కారణంగా ఇవి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలో ఇన్ఫర్మేషన్ తగ్గించడానికి దోహదం చేస్తాయి. బీరకాయలో ఉండే పీచు పదార్థాల వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది.
ఒబేసిటీతో పాటు డయాబెటిస్ కు బీరకాయతో చెక్ బీరకాయలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీరకాయలో ఉండే విటమిన్ బి 5 మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బీరకాయ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. బీరకాయల్లో ఉండే పోషకాల కారణంగా డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో మాత్రమే కాదు మూత్రంలో కూడా చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు బీరకాయ దోహదం చేస్తుంది.
బీరకాయలతో ఈ సమస్యలకు చెక్ ఇక బీరకాయలో ఉండే ఐరన్, ఐరన్ లోపం ఉన్నవారిలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను లేకుండా చేస్తుంది. బీరకాయలలో డైటరీ ఫైబర్ మెండుగా ఉండటం వల్ల మలబద్ధకంతో బాధపడే వారికి ఆ సమస్యను బీరకాయ తగ్గిస్తుంది. బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల మన గుండె పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.
బీరకాయలతో ఆరోగ్యం మెండు బీరకాయలలో ఉండే విటమిన్ ఏ మన కళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. బీరకాయ అల్సర్లతో బాధపడే వారికి శరీరంలోని వేడిని తగ్గించే కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటను కూడా బీరకాయ తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే బీరకాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మెండు. కనుక మరెందుకు ఆలస్యం బీరకాయలలో ఉన్న బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకున్న తర్వాత నాకొద్దు అనకుండా ప్రతి ఒక్కరు బీరకాయలను తినండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.