Maruti Suzuki Swift 2024: కళ్లు చెదిరే ఫీచర్లు.. అతి తక్కువ ధరతో మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త లుక్ చూశారా?

www.mannamweb.com


Maruti Suzuki Swift 2024: మీరు కూడా కారు కొనాలనే యోచనలో ఉన్నారా?? అయితే మీకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ న్యూ వేరియంట్ వచ్చేసింది.. మారుతి సుజుకీ స్విఫ్ట్ నాల్గవ తరం మోడల్ ను విడుదల చేసింది. అంతేకాదండోయ్ దీని ధర కేవలం రూ.6.50 లక్షల నుంచి ప్రారంభం కావడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలు ఆ కారు ఎలా ఉండనుంది? అందులో ఉన్న అత్యాధునిక ఫీచర్లు ఏంటి అనేది తెలుసుకుందాం.

దేశంలో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్ ఒకటన్న సంగతి తెలిసిందే. దీని 2024 అప్ డేటెడ్ వెర్షన్ రిలీజ్ అయింది. డిజైన్ లో పెద్దగా మార్పులు లేనప్పటికీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉన్నాయని తెలుస్తోంది. స్విఫ్ట్ లో కొత్తగా 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో.. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5- స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఇంజిన్ కు అనుసంధానం చేయబడింది. ఇది లీటర్ కు 25.72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఆ సంస్థ వెల్లడించింది.

అంతేకాదు క్యాబిన్ లో ఫ్రాంక్స్, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ ను కూడా అందించడం విశేషం. టాప్ ఎండ్ మోడల్ లో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్, 360 డిగ్రీ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్, టైప్ -సి ఛార్జింగ్ పోర్ట్ తో పాటు వెనుక భాగంలో ఏసీ వెంట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికం చేసింది. ఇక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ.6.50 లక్షలు మొదలుకొని రూ.9.65 లక్షల వరకు ఉండగా.. ప్రస్తుతం ఐదు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇంజిన్ 80 బిహెచ్పీ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్ లో స్వల్ప మార్పులు ఉన్నాయి. కొత్త గ్రిల్ ను అమర్చడంతో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్ తో హెడ్ ల్యాంపులను ఇచ్చారు. ఇక వెనుకభాగంలో స్కిడ్ ప్లేట్ తో కొత్త బంపర్, అలాగే సి -ఆకారపు డీఆర్ఎల్ లతో స్పెషల్ లైట్లను అమర్చడం విశేషం.