ఈక్విటీలో కపౌండ్ మ్యాజిక్ తెలిస్తే.. పెట్టుబడి పెట్టకుండా ఉండలేరు. మ్యూచువల్ ఫండ్ లో 25 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలు రూ.1.53 కోట్లకు చేరుకుంది. ఆగస్ట్ 1998లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ప్రారంభించిన సమయంలో దానిలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే అది 25 ఏళ్లలో ₹1.53 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ డివిడెండ్‌లు లభిస్తాయి.
మ్యూచువల్ ఫండ్ పథకాలు, డిఫాల్ట్‌గా, ప్రారంభ సంవత్సరాల్లో సంపాదించిన ఆదాయాలను మళ్లీ పెట్టుబడి పెట్టడం వలన, ప్రారంభ సంవత్సరాల్లో సంపాదించిన వాటి కంటే తరువాతి సంవత్సరాల్లో రాబడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. వారెన్ బఫెట్ వంటి పెట్టుబడిదారుల ద్వారా భారీ సంపద ఉత్పత్తికి కపౌండ్ ఇంట్రెస్ట్ ఒక ముఖ్య కారణం. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 25 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1.53 కోట్లుగా ఉండేది.
రూ.1 లక్ష పెట్టుబడి ఒక సంవత్సరంలో రూ.1.40 లక్షలకు పెరిగి ఉండేది. అదే డబ్బును మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే అది రూ.1.61 లక్షలకు పెరిగింది. అలాగే ఒక ఇన్వెస్టర్ ఐదు సంవత్సరాల కాలానికి రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే పెట్టుబడి మొత్తం రూ.2.11 లక్షల వరకు పెరిగి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు ఒక దశాబ్దం క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు పెట్టుబడి మొత్తం రూ.4.71 లక్షలకు పెరిగి ఉండేది. ఈ మ్యూచువల్ ఫండ్ పథకం గత 25 సంవత్సరాల ఏడు నెలల్లో అనూహ్యంగా 21.73 శాతం రాబడి అందించినందున రూ. 1 లక్ష పెట్టుబడి రూ.1.53 కోట్లకు పెరిగి ఉండేది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆగస్ట్ 27, 1998న ప్రారంభించారు. దీనిని ధవల్ జోషి, హరీష్ కృష్ణన్ నిర్వహిస్తున్నారు. ఈ ఫండ్ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్ టీ, అపోలో హాస్పిటల్స్ లో ప్రముఖంగా పెట్టుబడి పెట్టింది.
కీలకమైన విభాగాలు ఫైనాన్షియల్స్ (27 శాతం), టెక్నాలజీ (11.74 శాతం), హెల్త్‌కేర్ (11.3 శాతం), కన్స్యూమర్ స్టేపుల్స్ (8.7 శాతం) మరియు ఆటోమొబైల్ (5.19 శాతం) వెయిటేజీ ఇచ్చింది. దీని మొత్తం వ్యయ నిష్పత్తి(ఎక్స్ పెన్సివ్ రేషియో) 1.68 శాతంగా ఉంది.ఒక పథకం గతంలో అధిక రాబడిని ఇచ్చినందున అది భవిష్యత్తులో అదే వేగంతో పెరుగుతుందని అర్థం కాదని గుర్తుంచుకోవాలి.