దేశంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారు పనికి వెళ్లడానికి ప్రతిరోజు బైకులు చాలా అవసరం. అయితే, ఏ బైక్ కొనాలి, ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, ఏది తక్కువ ధరలో లభిస్తుంది అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.
అలాంటి వారి కోసం టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, బజాజ్ ప్లాటినా110, హోండా లివో, హీరో గ్లామర్ బైక్‌లు బెస్ట్ ఆఫ్షన్లుగా నిలుస్తున్నాయి. వీటి ధరలు, ఫీచర్లు, మైలేజ్ వివరాలను తెలుసుకుందాం.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus): ఈ బైక్ రూ.72,541 నుంచి రూ.76,541 (ఎక్స్-షోరూమ్)ల మధ్య ఉంటుంది. ఇది 109సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.08 పీఎస్ హార్స్‌పవర్, 8.7 ఎన్ఎం పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ బైక్ లీటరుకు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఇది సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ సాకెట్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్ బరువు 115 కిలోలు, 10-లీటర్ ఇంజన్ కలిగి ఉంది. దీనికి పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110): ఈ మోటార్ సైకిల్ ధర రూ. 71,609 (ఎక్స్-షోరూమ్). దీనిలో 115.45 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.6 PS హార్స్‌పవర్, 9.81 ఎన్ఎం పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
కొత్త బజాజ్ ప్లాటినా బైక్ కూడా లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ బరువు 123 కిలోలు, 10.5 లీటర్ల ఇంజిన్ కలిగి ఉంటుంది. దీనికి కూడా పెద్ద ప్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటుంది.
హోండా లివో (Honda Livo): ఈ మోటార్ సైకిల్ ధర రూ. 82,951 నుంచి 86,951 (ఎక్స్-షోరూమ్)ల మధ్య ఉంటుంది. దీనికి 109.51 సిసి పెట్రోల్, 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇది లీటరుకు 70కిలో మీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. ఇది సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది.
హీరో గ్లామర్ (Hero Glamour): ఈ బైక్ ధర రూ.84,548 నుంచి రూ.88,548 (ఎక్స్-షోరూమ్)ల మధ్య ఉంటుంది. దీనికి 125సీసీపెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ బైక్ లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది పూర్తిగా డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ నాలుగు బైక్‌లు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటాయి. ఇవి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తాయి.