రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి మనోహర్

www.mannamweb.com


నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.

181 ఉంటే రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున రైతు బజార్లలో గురువారం (జులై 11) నుంచి వికారాయించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ధరల స్థిరీకరణపై జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమీక్ష నిర్వహించారు. సామాన్యులకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకే ఇచ్చేలా చేయడంలో భాగంగా వ్యాపారులతో సమావేశమయ్యారు. బ్లాక్‌ మార్కెట్‌ లో విక్రయాలు లాంటివి చేయవద్దని సూచించారు. జులై 11 నుంచి రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. రూ.160 కిలో కందిపప్పు, రూ.49కే స్టీమ్డ్‌ రైస్‌, రూ.48కి ముడి బియ్యం విక్రయించాలని మంత్రి నాదెండ్ల నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.180 ఉండగా, స్టీమ్డ్‌ రైస్‌ రూ.55, 56 ఉంది. ముడి బియ్యం కేజీ ధర రూ.52.40కి విక్రయాలు జరుగుతున్నాయి.