కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదేండ్ల కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదేండ్ల కీలక ప్రకటన చేశారు. గతంలో జగన్‌ కు చెప్పి చెప్పి జనం అలసిపోయారు..కొత్త రేషన్ కార్డులు కోసం డేటా తీసుకోండి అంటూ ఆదేశాలు ఇచ్చారు మంత్రి నాదేండ్ల.


ద్వారంపూడి కుటుంబానికి లబ్ది చేకూరిలా వ్యవస్థలు నడవవు…గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పెరేషన్ ద్వారా 36300 కోట్లు అప్పులు చేశారని ఆగ్రహించారు. 1600 కోట్లు రైతులు కు అప్పులు ఉంచి వెళ్లారని… కాకినాడ లో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందని ఆరోపణలు చేశారు.

ఒక కుటుంబం కోట్లు రూపాయలుసంపాదించారు… చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్ లలో వెరిఫై చేశాం,19 కేసులు నమోదు చేశాం… ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యము కొనుగోలు లో రైతులు కి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ఏపీ లో నాలుగు కోట్ల నలభై లక్షలు మీద రేషన్ మీద ఆధారపడ్డారు…జిల్లాలో గత ప్రభుత్వం అవినీతి వలన కౌలు రైతులు తగ్గిపోయారని వివరించారు మంత్రి నాదేండ్ల.