బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
సుమారు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మిథున్ సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులతో పంచుకున్నారు. ‘ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్య లేదు. అయితే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక దెయ్యంలా అన్నీ తినేవాడిని. అందుకు తగిన శిక్ష అనుభవించాను. ప్రతి ఒక్కరూ మితాహారం తీసుకోవాలనేది నా సలహా. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు తింటే ఏమీ కాదనే అపోహలో మాత్రం ఉండొద్దు. డైట్ కంట్రోల్ ఉండాల్సిందే. ఇక ఎప్పటిలాగే పని మొదలుపెట్టాలి. వీలైనంత త్వరగా షూటింగ్‌లో జాయిన్ అవుతాను. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్ చేశారు. నా బాగోగులు గురించి అడిగిన ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు ‘ అని మిథున్ చెప్పుకొచ్చారు.
ఇక మిథున్ చక్రవర్తి ఆరోగ్యంపై ఆయన కుమారుడు నమషి చక్రవర్తి స్పందించారు. ‘ మానాన్న ఇప్పుడు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు నమషి. మిథున్ చక్రవర్తి 1976 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. ‘డిస్కో డాన్సర్’, ‘జంగ్’, ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’, ‘ప్యార్ జుక్తా నహీ’, ‘మర్ద్’ వంటి ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేశ్ నటించిన గోపాల గోపాల తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. రంగంలో మిథున్ అందించిన సేవలకు గుర్తింపునకు గానూ ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత మీడియాతో మాట్లాడుతోన్న మిథున్ చక్రవర్తి..
মিঠুনকে কেন বকলেন মোদি?
.
.
.
.#PMNarendraModi | #MithunChakraborty | #hospital | #PMcall | #actormithunchakraborty | #healthcondition | #rebuked | #Banglanews | #madhyom | @MadhyomBangla pic.twitter.com/UWnAliv038— Madhyom (@MadhyomBangla) February 13, 2024