కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుండి విడుదల చేసిన పోస్ట్‌లో ఇప్పుడు దేశంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక జీవనాధారంగా మారిందని ఆర్థిక మంత్రి అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో..
దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ సర్కార్ ముందుగా రైతులకు ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో లక్షలాది మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామ్ అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు సకాలంలో తక్కువ వడ్డీ రేటుకే రుణ సౌకర్యాన్ని పొందుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి వివరాలను ఎక్స్ వేదిక పోస్టు చేశారు. రైతులకు అందించే ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా మారిందని, ఇప్పటివరకు 465 లక్షల దరఖాస్తులు ఆమోదించినట్లు చెప్పారు. వీటి పరిమితి రూ.5.7 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె అన్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరం అయ్యాయి. కెసిసి ద్వారా, వ్యవసాయ కార్యకలాపాలకు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ రూపంలో రూ.5 లక్షల వరకు సహాయం చేస్తుంది.