మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు.. ఫ్రీగా అకౌంట్ లో రూ.50 వేలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతున్న సంగతి తెలిసిందే.


మోదీ సర్కార్ ఒక ఆన్ లైన్ కాంటెస్ట్ ను నిర్వహిస్తుండగా ఈ కాంటెస్ట్ లో విజేతగా నిలిస్తే ఏకంగా 50,000 రూపాయలు పొందవచ్చు. లోగో డిజైన్ చేయడం ద్వారా ఈ కాంటెస్ట్ లో పోటీ చేసి విజేతగా నిలిచే అవకాశం అయితే ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) కోసం లోగో క్రియేట్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎస్‌టీపీఐ కు సంబంధించిన అడాప్షన్ ఆఫ్ మెఘ్ రాజ్ బై యూజర్ డిపార్ట్‌మెంట్స్ కోసం లోగో క్రియేట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. మైగౌ ద్వారా లోగో డిజైన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

మన దేశానికి చెందిన పౌరులంతా ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. జేపీఈజీ, జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్లలో లోగోను డిజైన్ చేసి పంపాల్సి ఉంటుంది. ఒరిజినల్ డిజైన్స్ కూడా సబ్‌మిట్ చేయడంతో పాటు లోగో డిజైన్ చేయడం వెనుక కారణాలను అందుకు సంబంధించిన సారాంశాన్ని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో సైతం యూజ్ చేసుకునేలా ఆ లోగో ఉండాలి.

రెజల్యూషన్ 300 డీపీఐతో ఉన్న లోగోలను మాత్రమే పంపాల్సి ఉంటుంది. లోగో నచ్చితే మాత్రం కమిటీ నుంచి 50 వేల రూపాయలు పొందవచ్చు. జులై 22వ తేదీ వరకు ఈ కాంటెస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ కాంటెస్ట్ టాప్2 ఫ్రైజ్ 20 వేల రూపాయలుగా ఉంది. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ పోటీ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.