Mohanbabu: మనోజ్ పై చర్యలు తీసుకోండి.. మోహన్ బాబు ఫిర్యాదు..!

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. మనోజ్ పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు.
తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మంచు మనోజ్ చొరబడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాజాగా తన కొడుకు మంచు మనోజ్ పై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా.. మనోజ్ నారావారి పల్లెకి తన వేనత్త మేడపాని విజయమ్మకు ఇంటికి వస్తానంటూ ఆమెకు కబురు పంపారని లేఖలో తెలిపారు.
తండ్రి మాట వినకుండా, అన్నతో గొడవపడుతూ ఇంటి పరువు తీస్తున్నాడు.. కాబట్టి తన ఇంటికి రావద్దని ఆమె తెలిపిందంట. అయినా వినకుండా మనోజ్ ఏదో దురుద్దేశంతో నారా వారి పల్లెకు వెళ్లినట్లు మోహన్ బాబు లేఖలో తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్ ను కలిసి ఒక నిమిషం మాట్లాడినట్లు తెలిపారు. ఇక తిరుగు ప్రయాణంలో మా విద్యాసంస్థ మోహన్ బాబు యూనివర్సిటీలోకి బలవంతంగా వెళ్లాలని చూశాడని తెలిపారు.

200 మందితో కలిసిలోపలికి వెళ్లే ప్రయత్నం చేసినట్లు ఆయన ఆరోపించారు. వద్దని పోలీసులు హెచ్చరించిన వినలేదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే కోర్టు మనోజ్ విద్య సంస్థల ప్రాంగణలోని వెళ్లకూడదని ఆదేశించిందని తెలిపారు. దీనిపై పోలీసులు కూడా అతడిని హెచ్చరించారు. దీంతో కొంత వెనక్కి వెళ్లిన మనోజ్ మోహన్ బాబు విద్యాసంస్థలోని డైయిరీ ఫారంలోని గేటుపై నుంచి దూకి లోపలికు ప్రవేశించాడు. ఇది కచ్చింతంగా కోర్టు ధిక్కారణే అవుతుంది. కాబట్టి వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగ పాలీసులకు, కోర్టుకు అప్సీలు చేస్తున్నాను అని ఆయన లేఖలో పేర్కొన్నారు.