Monsoon: గుడ్ న్యూస్.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
Monsoon: అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు… క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రుతుపవనాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. రుతపవనాల ప్రభాతంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి. రుతుపవనాలు రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది.