India Today Survey On AP Elections: ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది..? ఎవరికెన్ని సీట్లు వస్తాయి..? అని ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరిట ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే (India Today) సర్వే చేయించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
అవును.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో సరిగ్గా ఈ టైమ్‌లోనే సీఎం వైఎస్ జగన్ రెడ్డిని, వైసీపీని దెబ్బ కొట్టాలని టీడీపీ-జనసేన (TDP-Janasena) పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. జగన్ చేసిన తప్పులను ‘రా కదలి రా..’ కార్యక్రమం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకెళ్తుంటే.. రెండ్రోజులకోసారి మీడియా మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సర్కార్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులతో ఊహించని రీతిలో అసంతృప్తి వైసీపీకి తోడయ్యింది. దీంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇవన్నీ టీడీపీ-జనసేన మిత్రపక్షాలకు బాగా ప్లస్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది..? ఎవరికెన్ని సీట్లు వస్తాయి..? అని ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరిట ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే (India Today) సర్వే చేయించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
అసలేంటీ సర్వే..?
యావత్ దేశం దృష్టి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలపై ఉందన్న విషయం తెలిసిందే. కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ కొడతారా..? లేకుంటే మోదీకి విపక్షాల ఇండియా కూటమి చెక్ పెడుతుందా..? అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో పలు జాతీయ మీడియా, ప్రముఖ సర్వే సంస్థలు ఓటర్ల నాడి ఎలా ఉందని సర్వేలు నిర్వహించాయి. ఇప్పటి వరకూ పలు సంస్థలు సర్వేలు చేసి అధికారమెవరిదో నిగ్గు తేల్చగా.. తాజాగా ‘ఇండియా టుడే’ సంచలన సర్వే రిలీజ్ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయని ఉంది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అఖండ విజయాన్ని సాధించబోతోందని తేలింది.
మొత్తం లోక్‌సభ స్థానాలు : 25
తెలుగుదేశం : 17
వైఎస్సార్సీపీ : 08
ఓట్ల శాతం :-
టీడీపీ: 45 శాతం
వైసీపీ : 41.1 శాతం
బీజేపీ : 2.1 శాతం
కాంగ్రెస్ : 2.7 శాతం
ఇదీ సీన్..!
చూశారుగా.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో!. అంటే 2019 ఎన్నికల ఫలితాలు మొత్తం తారుమారు అవుతాయన్న మాట. ఎలాగంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ-151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ మాత్రం కేవలం 03 ఎంపీ స్థానాలకే పరిమితం అయ్యింది. ఇండియా టుడ్ సర్వే ప్రకారం 2024 మొత్తం రివర్స్ కానున్నాయి. 2023 డిసెంబర్- 15 నుంచి జనవరి- 28 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది.