MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెరీర్‌లో చివరి ఐపీఎల్(IPL 2024)కు సిద్ధమవతున్నాడు. టోర్నీకి నెల రోజులే ఉండడంతో మహీ భాయ్ ప్రాక్టీస్ వేగం పెంచాడు.
తాజాగా రాంచీలో అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అందులో ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాటుతో కనిపించాడు. అలాగని అది ఏ పెద్ద కంపెనీ లోగోను అనుకుంటే పొరపడినట్టే. మరి ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అతడి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాలనే ఉద్దేశంతో అతడి షాప్ పేరుతో ఉన్న స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మహీ ప్రాక్టీస్ చేశాడు.
ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్'(Prime Sports) అనే షాప్ ఉంది. అందులో అన్ని రకాల క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇతర ఆట సామగ్రి లభిస్తాయి. దాంతో, తన మిత్రుడి దుకాణానికి మరింత పాపులారిటీ తేవడం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. తన కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉపయోగించాడు. కానీ, అతడు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. దాంతో, ప్రైమ్ స్పోర్ట్స్ బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసినవాళ్లంతా.. అందుకే ధోనీ ప్రత్యేకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Dhoni has "Prime Sports" sticker on his bat
Prime Sports is the name of the shop of his childhood friend . pic.twitter.com/RsaGiDLi7a
— Don Cricket 🏏 (@doncricket_) February 7, 2024
అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలికిన మహీ భాయ్.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన ముద్ర వేశాడు. 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ఖు ఐదో ట్రోపీ కట్టబెట్టి సారథిగా తన సత్తా తగ్గలేదని మరోసారి చాటుకున్నాడు. 41 ఏండ్ల వయసులోనూ చెక్కెచెదరని ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్న మహీ 17వ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్ బై పలికే చాన్స్ ఉంది.