పీఎం మోదీకి ఇష్టమైన మునగాకు పరాటా.. ఎలా చేయాలంటే..

www.mannamweb.com


మునగాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మునక్కాయలు, మునకాగు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వారంలో ఒక్కసారి తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వీటిని తినడం వల్ల ఎలాంటి రోగాలు దరి చేరకుండా ఉంటాయి. మునకాగు తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఎక్కువ శాతం ఐరన్ లభిస్తుంది. దీన్ని పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పెట్టడం చాలా మంచిది. నేరుగా తినలేని వారు ఈ ఆకును చపాతీల్లో వేసి తినవచ్చు. ఇలా వీటితో చేసే వాటిల్లో మునగాకు పరాటా కూడా ఒకటి. మునగాకు పరాటా చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి ఇంత మంచిది కాబట్టే.. పీఎం మోదీ కూడా మునగాకు పరాటాలను ఇష్టంగా తింటారు. మరి ఈ మునగాకు పరాటాను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మునగాకు పరాటాకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ, నెయ్యి, మునగాకు.

మునగాకు పరాటా తయారీ విధానం:

ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి.. వీటిని కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. వేడి తగ్గాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఇందులో మునగాకు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ వేసి ఓ ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత గోధుమ పిండి తీసుకుని అందులో ముందుగా వేయించిన మునగాకును వేయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేస్తూ.. చపాతీ ముద్దాలా చేసుకుని కాసేపు పక్కన పెట్టాలి.

ఆ తర్వాత పెనం వేడి చేసి.. చపాతీల్లా ఒత్తుకుని ఒక్కో పరాటా వేసుకుని కాల్చాలి. ఈ పరాటాలను పెరుగు, కిచప్, మయోనీస్, ఇతర నాన్ వెజ్ కర్రీలు, వెజ్ కర్రీలు వేటితో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా చేసి పెట్టవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది.