పుట్ట గొడుగులు అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్ట పడి తింటారు. నాన్ వెజ్ తినని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పుట్టగొడుగులకు మంచి మసాలా పెట్టి వండితే ఆహా అంటారు. చికెన్ కర్రీ లానే అనిపిస్తుంది. మష్రూమ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. మరి మష్రూమ్ మసాలా కర్రీని ఎలా వండుతారు? ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
మష్రూమ్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, పులావ్ దినుసులు, ఆయిల్, బటర్ లేదా నెయ్యి.
మష్రూమ్ మసాలా కర్రీ తయారీ విధానం:
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా గోరు వెచ్చని నీటితో కడగాలి. అనంతరం మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కర్రీ చేసే గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో పులావ్ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలర్ మారేంత వరకూ వేయించాలి.
ఇవి వేగాక కరివేపాకు వేసి వేయించి.. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి బాగా కలపాలి. ఇవన్నీ ఓ పావు గంట సేపు వేయించుకోవాలి. అనంతరం రుచి చూసి.. కారం, ఉప్పు వేసి మళ్లీ ఒకసారి కలపాలి. అనంతర వాటర్ వేసి ఉడికించాలి. కర్రీ దగ్గర పడుతున్న కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి.. దగ్గర పడ్డాక దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ సిద్ధం. ఈ కర్రీని అన్నం, రోటీలు, పులావ్‌లోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.