మటన్ మరాగ్ సూప్.. సూపర్ టేస్టీ, హార్స్ ఎనర్జీ

టన్ మరాగ్.. ముఖ్యంగా ముస్లిం వివాహాలలో భోజనంలో స్టార్టర్ గా దీనిని ఇస్తారు. మటన్ మరాగ్ లో బోలెడు పోషకాలు ఉంటాయి . లేత మటన్ మరియు గొర్రెల బోన్స్ తో తయారు చేసే ఈ సూప్ చాలా బలవర్ధకమైన ఆహారం.


ఈ సూప్ తయారీకి వాడే పదార్థాలు కూడా అంతే బలవర్ధకమైనవి.

మటన్ మరాగ్ సూప్ లో ఫుల్ పోషకాలు

మటన్ మరాగ్ ఎముకలు మరియు మృదు కణజాలాల నుండి వచ్చే పోషకాలు మన శరీరానికి సూపర్ ఎనర్జీని ఇస్తాయి. శరీరానికి కావలసిన ఐరన్, విటమిన్లు, ఖనిజాలను ఈ సూప్ అందిస్తుంది. మటన్ మరాగ్ లో ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మన శరీరాన్ని నిర్వహించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మటన్ మరాగ్ సూప్ ఉపయోగపడుతుంది.

మటన్ మరాగ్ సూప్ తో ఈ సమస్యలకు చెక్

మటన్ మరాగ్ ఎముకలకు, దంతాలకు కూడా కావలసిన క్యాల్షియంను అందిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి ఈ సూప్ దోహదం చేస్తుంది.మటన్ మరాగ్ సూప్ ఒక మొఘలాయి డిష్. ఈ సూప్ తయారీకి వాడే పదార్థాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. మటన్ మరాగ్ తయారు చేయడానికి లేత మటన్ మరియు బోన్స్, నెయ్యి, పాలు, పెరుగు, గరం మసాల, ఉప్పు వంటివి అవసరం.

శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే మటన్ మరాగ్

వీటన్నిటి తోటి తయారు చేసే మటన్ మరాగ్ మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. సూపర్ ఎనర్జీ బూస్టర్ గా ఇది ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించడానికి, రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడానికి మటన్ మరాగ్ తాగితే మంచిది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా ఇందులో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి.

రుచికి రుచి బలానికి బలం మటన్ మరాగ్

యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తూ శరీర కణాలను దెబ్బ తినకుండా ఈ సూప్ లో ఉండే పోషకాలు కాపాడతాయి. శరీరాన్ని దృడంగాను, ఆరోగ్యంగానూ ఉంచడంతో పాటు ఎముకల బలాన్ని, పుష్టిని కూడా పెంచుతుంది మటన్ మరాగ్. అలాంటి పుష్టి ని ఇచ్చే సూప్ ను తయారు చేసుకోవటం నేర్చుకుని చేసుకుని తాగండి. రుచికి రుచి.. బలానికి బలం..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.