రీసెంట్‌గా ‘కుబేర’తో హిట్ అందుకున్న నాగార్జున.. త్వరలో తన 100వ చిత్రంతో బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడట డైరెక్టర్. అంతే కాకుండా.. ఇది నాగార్జున కెరీర్‌లో సెంచరీ మూవీ కావడంతో.. ఈ చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున నటించబోయే ఈ 100వ చిత్రాన్ని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చే పనిలో పడ్డారట మేకర్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ కూడా ఆ రేంజ్‌లోనే అనుకున్నారట. ఇందులో భాగంగానే సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట దర్శనమిచ్చింది. వైరల్ అవుతోన్న న్యూస్ మేరకు ‘ఎక్స్‌క్లూజివ్.. నాగ్ 100వ చిత్రానికి ‘కింగ్ 100′ ఫిక్స్. ఈ ల్యాండ్ మార్క్ మూవీకి రాక్‌స్టార్ DSP సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆగస్ట్ 2025లో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అంటూ వైరల్ అవుతోన్న పోస్ట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.