బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హరికృష్ణ గ్రామీణ విద్యార్థులకు విదేశీ నిపుణులతో పాఠాలు చెప్పిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల ఇంగ్లిష్ ప్రొఫెసర్లు, నిపుణులతో వర్చువల్‌గా మాట్లాడిస్తున్నారు.
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హరికృష్ణ గ్రామీణ విద్యార్థులకు విదేశీ నిపుణులతో పాఠాలు చెప్పిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల ఇంగ్లిష్ ప్రొఫెసర్లు, నిపుణులతో వర్చువల్‌గా మాట్లాడిస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడి పిల్లలతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక్కడి పిల్లలు ఆయా దేశాల భాషలు, ఉచ్చారణపై అవగాహన పెంచుకుంటున్నారు. భావ, నైపుణ్య వినిమయంతోపాటు సృజనాత్మకత పెంపునకు ఈ క్లాస్‌రూం దోహదపడుతోంది. 2017 నుంచి పాఠశాలలో వారానికోసారి గంటపాటు ఈ తరహా బోధన కొనసాగుతోంది.