బాయిలర్ చికెన్​తో “నాటుకోడి టేస్ట్” – పక్కా కొలతలతో గ్రేవీ కర్రీ రెసిపీ

వంటింట్లో నుంచి వాసన చూసి చెప్పేలా చికెన్ కర్రీ టేస్ట్ ఉండాలి. సాధారణంగా విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఘుమఘుమలాడుతుంది. మసాలా వాసన వీధుల్లోకి వచ్చేస్తుంది. బాయిలర్ చికెన్ అయినా సరే! నాటు కోడి స్టైల్​లో ఇలా చేసుకోవచ్చు. మీరూ ఓ సారి ఇలా బాయిలర్ చికెన్​తో నాటుకోడి టేస్ట్ ట్రై చేయండి.


కావల్సిన పదార్థాలు :

  • చికెన్ – కేజీ
  • నూనె – 5 టేబుల్ స్పూన్లు
  • పసుపు – అర స్పూన్
  • ఉప్పు – 1 స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
  • కారం – 2.5 స్పూన్లు
  • నూనె – 1 టేబుల్ స్పూన్
  • బిర్యానీ ఆకులు – 2
  • యాలకులు – 2
  • జీలకర్ర – అర స్పూన్
  • పచ్చిమిర్చి – 3
  • పుదీనా – కొద్దిగా
  • కొత్తిమీర – కొద్దిగా
  • ఉప్పు – రుచికి సరిపడా
  • కసూరి మేతి – కొద్దిగా
  • మసాలా కోసం :

    • ధనియాలు – 2 టీ స్పూన్లు
    • మిరియాలు – అర స్పూన్
    • జీలకర్ర – అర స్పూన్
    • దాల్చిన చెక్క – చిన్న ముక్క
    • లవంగాలు – 4
    • యాలకులు – 3
    • జాపత్రి – కొద్దిగా
    • అనాసపువ్వు – కొద్దిగా
    • గ్రేవీ కోసం :

      • నూనె – 1 టేబుల్ స్పూన్
      • జీడిపప్పు – 6
      • టమోటాలు – 2
      • తయారీ విధానం :

        • ఒక గిన్నెలోకి కిలో చికెన్ శుభ్రం చేసి తీసుకోవాలి. అందులో అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 స్పూన్ల కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇపుడు చికెన్ బాగా మర్దనా చేస్తూ కలపాలి. అల్లం, కారం, ఉప్పు, పసుపు, నూనె అన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇపుడు గిన్నె మూత పెట్టుకుని 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
        • ఇపుడు స్టవ్​పై కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాసపువ్వు వేసుకుని సన్నటి మంటపై వేయించి పక్కకు తీసుకోవాలి.
        • ఇపుడు అదే కడాయిలో నూనె వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా, పొడవుగా కట్ చేసి వేసుకోవాలి.
        • ఇపుడు ఏడెనిమిది జీడిపప్పు, టమోటా ముక్కలు వేసుకుని బాగా కలుపుతూ ఉల్లిపాయలు, టమోటా ముక్కలు మగ్గించుకుని పక్కన పెట్టుకోవాలి.
        • ఇపుడు ముందుగా వేయించిన మసాలా దినుసులు మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ, జీడిపప్పు, టమోటా ముక్కలను చల్లార్చి మిక్సీలోకి తీసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
        • ఇపుడు స్టవ్​పై కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని బిర్యానీ ఆకులు, యాలకులు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని ప్రై చేసుకోవాలి. ఇపుడు పుదీనా, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని కలపాలి.
        • ఐదారు నిమిషాల పాటు వేయించన తర్వాత ముందుగా వేయించిన ఉల్లిపాయ, టమోటా పేస్ట్ వేసుకుని కలపాలి. ఇపుడు మరో ఐదు నిమిషాల పాటు మూతపెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి గ్రైండ్ చేసిన మసాలా పొడిని కూడా వేసుకుని కలపాలి.
        • ఇపుడు గ్రేవీకి సరిపడా అంటే చికెన్ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూతపెట్టి మీడియం ప్లేమ్​లో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసుకుని కలిపి స్టవ్ కట్టేసి మరో 2 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే కర్రీ అద్దిరిపోతుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.