Navodaya : నవోదయ నోటిఫికేషన్ విడుదల

జవహర్ నవోదయ విద్యాలయ సమితి(NVS) 2026-2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌(Entrance Exam) విడుదల అయింది.


గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం.. ఈ పరీక్ష ద్వారా 653 నవోదయ విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 15 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి నవంబర్ 15 ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలో భాగంగా విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, వయస్సు మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య ఉండాలని అధికారులు తెలియజేశారు. పరీక్ష రెండు దశల్లో – జనవరి 17 (ఫేజ్ 1), ఏప్రిల్ 11(ఫేజ్ 2)లో జరగనుంది. దరఖాస్తు ఫీజు లేకుండా navodaya.gov.in లేదా cbseitms.rcil.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మొత్తం 100 మార్కులకు 2 గంటల పరీక్ష ఉండగా.. వీటి ఫలితాలు జూన్ లో విడుదల కానున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.