నీట్ పేపర్ లీక్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

www.mannamweb.com


ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై(NEET Paper Leakage) దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకే కేంద్ర విద్యాశాఖ రంగంలోకి దిగింది. పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.

పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో మెరుగుదల, NTA నిర్మాణం, పనితీరుపై సిఫార్సులు చేయడానికి ఈ కమిటీ ఉపయోగపడనుంది. 2 నెలల్లో మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేయనుంది.

కమిటీ చైర్మన్ గా రాధాకృష్ణన్ ఉండనున్నారు. కమిటీ సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు,మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ కె.రామ మూర్తి,పంకజ్ బన్సల్,ఢిల్లీ ఐఐటీ అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్,కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఉండనున్నారు.