కాళ్ళ నరాల నొప్పులు.. ఈ వ్యాధుల డేంజర్ బెల్స్

చాలామంది విపరీతమైన కాళ్ల నొప్పులతో, కాళ్ల నరాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే కాళ్ళ నరాల నొప్పులు ఎందుకు వస్తాయి? ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే కాళ్ల నరాల నొప్పులు వస్తాయి?


దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

కాళ్ళ నరాల నొప్పులకు కారణాలు ఇవే

కాళ్ల నరాల నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు డయాబెటిస్ కంట్రోల్లో లేకపోతే కాళ్ల నరాల నొప్పులను చూస్తారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే డయాబెటిక్ న్యూరోపతి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మధుమేహం ఉన్న వారికే కాకుండా నరాలకు గాయాలు అయిన వారికి, సయాటికా వంటి సమస్యలు ఉన్నవారికి, వెన్నెముక సమస్యలు ఉన్నవారికి. శరీరంలో విటమిన్ లోపాలు ఉన్నవారికి విపరీతంగా కాళ్లనరాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ సమస్యలు ఉంటె జాగ్రత్త

కాలు లేదా వెన్నెముకకు సంబంధించి గాయాలైనా,కండరాలకు గాయమైనా, కీళ్లకు గాయాలైనా, నరాలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక వెన్నెముకలో సయాటికా నరం కుదించబడటం లేదా దెబ్బ తినడం వల్ల కాళ్ల నరాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక వెన్నెముక సమస్యలు ఉన్నవారికి కాళ్ళ నరాలు మరింత బాధిస్తాయి. శరీరంలో విటమిన్ బి1, బి6, బి12 మరియు విటమిన్ ఈ లోపాలు ఉన్నవారికి కాళ్లనరాల నొప్పులు బాధించే అవకాశం ఉంది.

ఈ సమస్యలతో కూడా కాళ్ళ నరాల నొప్పులు

కొంతమందిలో శరీరంలో రక్తం గడ్డ కడుతుంది. ఇలా రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారికి కూడా కాళ్ళ నరాల నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి కూడా కాళ్ల నరాలు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఎవరైనా కాళ్ళ నరాలు నొప్పి తో బాధపడుతూ ఉంటే అటువంటి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు కాళ్ళను ఎంత ఆరోగ్యంగా చూసుకుంటే అంత మంచిది. కాళ్ళ నరాల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా అందుకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు చికిత్స తీసుకోవాలి. తగిన జాగ్రత్తలను కూడా పాటించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.