New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

www.mannamweb.com


మే నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జూన్ నెల ప్రారంభమవుతుంది. జూన్‌ నెలలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఒకవైపు దేశ పొలిటికల్ కారిడార్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు, మొదటి తేదీ నుండి మీ జేబుకు సంబంధించిన అనేక విషయాలలో మార్పులు ఉండబోతున్నాయి. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మొదటి తేదీ ఉదయాన్నే నిర్ణయించబడతాయి. ఒకటో తేదీ నుంచి ఆధార్‌కు సంబంధించిన నిబంధనలలో కూడా మార్పులు రానున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ రూల్స్‌లో కూడా అనేక మార్పులు రానున్నాయి. వీటిని పాటించకుంటే సామాన్యుల జేబులపై పెనుప్రభావం పడుతుంది. జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్పుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు: గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో ప్రతి నెలా ఒకటో తేదీన మార్పు ఉంటుంది. దేశీయ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. జూన్ 1న రెండు రకాల గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పు ఉండవచ్చు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై డేటా ప్రకారం, గృహ గ్యాస్ సిలిండర్ ధరలో చివరిసారిగా మార్చి 9న తగ్గుదల కనిపించింది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు చౌకగా మారాయి.
ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌పై ఉపశమనం: సామాన్యులకు గొప్ప ఉపశమనం ఇస్తూ, UIDAI ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌ తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. అంటే ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకుంటే ఒక్కో అప్ డేట్ కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
25 వేల జరిమానా విధించే నిబంధన: మరోవైపు, మైనర్ వాహనం నడుపుతున్నట్లు తేలితే, అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం, దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయస్సు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. మైనర్ ఇలా చేస్తే రూ.25,000 జరిమానా విధించవచ్చు. అలాగే, అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి లైసెన్సు లభించదు.
ట్రాఫిక్ రూల్స్‌లో కూడా మార్పులు: జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం.. అతి వేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా డ్రైవింగ్ పరీక్షలు: ప్రజలు ఇప్పుడు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు (కొత్త రూల్ జూన్ 2024లో వర్తిస్తాయి). ఇక్కడ వారి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. వారికి లైసెన్స్ కూడా జారీ చేయబడుతుంది. గతంలో ఈ పరీక్షలు ఆర్టీఓ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ కేంద్రాల్లోనే జరిగేవి. ఈ నియమం జూన్ 1 నుండి వర్తిస్తుంది., అయితే ఈ పరీక్షలు RTO ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రమే నిర్వహించబడతాయి. ఈ నిబంధన కూడా జూన్ 1 నుంచి మాత్రమే వర్తిస్తుంది.