మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఖండాల సంఖ్యలో ఎలాంటి మార్పు అయితే రాలేదు.
కేవలం మన చిన్నప్పటి నుంచే కాదు.. మన అమ్మ, నాన్న వారి కాలం నుంచి కూడా మొత్తం ఏడు ఖండాలు అనే చదువుతున్నారు. ఖండాల సంఖ్య అయితే పెరగడం లేదు, తగ్గడం లేదు. ఇప్పటికీ కూడా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా మొత్తం ఏడు ఖండాలు అని చెబుతుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఖండం రాబోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఏడు ఉన్న ఖండాల సంఖ్య పెరగబోతుందా? కొత్తగా ఎన్ని ఖండాలు వస్తున్నాయి? ఆ కొత్త ఖండం పేరు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
7 ఖండాలు ఇకపై మొత్తం 8 ఖండాలుగా మారే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరో 20 కోట్ల సంవత్సరాలు లేదా 30 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై ఒక కొత్త సూపర్ ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం మొత్తం కుంచించుకుపోయి పూర్తిగా మూసుకుపోతుందట. దీనివల్ల అక్కడ భారీ మొత్తంలో భూభాగం ఏర్పడుతుందని అంటున్నారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన కర్టిన్ యూనివర్సిటీ, చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. రాబోయే 20 కోట్ల ఏళ్లలో భూమికి ఏమి జరుగుతుందో అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఖండాలు అన్ని కూడా ప్రతీ 60 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఢీకొంటాయి. ఇవి ఒక సూపర్ ఖండాన్ని ఏర్పరుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే దీన్నే సూపర్ ఖండాల చక్రం అని అంటారు. అయితే ప్రస్తుతం ఉన్న ఖండాలు అన్ని కూడా మరో కొన్ని కోట్ల సంవత్సరాలలో ఒకచోట చేరుతున్నాయని అర్థం.
కొత్త ఏర్పడే సూపర్ ఖండానికి సైంటిస్ట్‌లు అమాసియా అని పేరు పెట్టారు. అమెరికా, ఆసియా ఢీకొన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రం మొత్తం మూసుకుపోయి కొత్త ఖండం ఏర్పడుతుంది. అందుకే దీనికి అమాసియా అని పేరు పెట్టారు. అయితే సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించి భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఎలా అభివృద్ధి చెందుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపుగా 30 కోట్ల సంవత్సరాల తర్వాత పసిఫిక్ మహాసముద్రం మొత్తం మూసుకుపోయే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పసిఫిక్ మహాసముద్రం 70 కోట్ల సంవత్సరాల క్రితం ఒక సూపర్ ఖండం నుంచి విడిపోయింది. అయితే ఇది విడిపోయినప్పుడు ఏర్పడిన పాంథలస్సా సూపర్ సముద్రంలో ఉన్న ఒక మిగిలిన భాగం. అయితే ఇది భూమిపై ఉన్న పురాతన మహాసముద్రాల్లో ఒకటి. అయితే డైనోసార్ల కాలం నుంచి ఎక్కువ మొత్తంలో కుంచించుకుపోయిందని అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త భౌగోళిక మార్పులు వల్ల భవిష్యత్తులో భూమి ఏమైనా మారుతుందా? లేదా? అనేది చూడాలి.
































