Investment Plan: ఇప్పుడు రూ.1 లక్ష పెడితే రూ.2 కోట్లు గ్యారంటీ

PPFలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. ప్రతి నెల రూ.1 లక్ష ఆదాయం రావాలంటే ఇప్పుడే ఇందులో పెట్టుబడి పెడితే అది సాధ్యం.. ఇలా చేయండి..


మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే మీ ఆర్థిక భవిష్యత్తు నిర్మించడంలో ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీంట్లో మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకు మీరు PPF లో ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసా..

రిటైర్‌మెంట్ తర్వాత మీ భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సమస్యలు వచ్చినా వాటిని నివారించడానికి PPF వంటి పొదుపు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. PPF అనేది భారత ప్రభుత్వ సమర్థతతో కూడిన ఒక సురక్షితమైన పెట్టుబడిని ఇస్తుంది. ఇది కేవలం అధిక రాబడిని మాత్రమే ఇవ్వడం కాకుండా, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారత ప్రభుత్వ సంక్షేమ పథకం. ఇది దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడి పథకం. PPFలో పెట్టుబడులు రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అందిస్తుంది.

PPF ఖాతాకు 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ 15 సంవత్సరాల తర్వాత, మీరు అవసరమైనప్పుడు 5 సంవత్సరాలు పొడిగించి, ఖాతా కొనసాగించవచ్చు.

PPFలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు రూ.1.50 లక్షల వరకు పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, దానిపై పొందే వడ్డీ, పరిపక్వత మొత్తం పన్ను రహితంగా ఉంటుంది.

మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటే, మీరు ప్రతి సంవత్సరంలో రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇది 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, మీరు గరిష్ట వడ్డీని పొందగలుగుతారు.

ప్రతి ఏప్రిల్ 1-5 మధ్య మీరు ఈ పెట్టుబడులు చేస్తే, సంవత్సరం మొత్తం వడ్డీని పొందగలుగుతారు. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మీరు ఖాతాను 5 సంవత్సరాల బ్లాక్‌లుగా పొడిగించి పెట్టుబడులు చేయడం కొనసాగించాలి. 35 సంవత్సరాల తర్వాత, మీరు రూ.2,26,97,857 వరకు చేరవచ్చు. ప్రస్తుతం PPFపై వడ్డీ రేటు 7.1%. ఈ వడ్డీతో మీరు 15 లేదా 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, మీరు మరింత లాభాలను పొందగలుగుతారు.