మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏకగ్రీవం! ఇంత సైలెంట్ గా చక్రం తిప్పింది ఎవరు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, 2021 న జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా 2021 మా ఎన్నికలు జరిగాయి. ఇరు పక్షాల నుంచి పోటా పోటీ ప్రచారం, ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల తూటాలు పేల్చుకున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ మా ఎన్నికల గురించి వార్తలే హల్ చల్ చేశాయి. ఒకరకంగా ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయని వార్తలు వచ్చాయి. ఉత్కంఠంగా సాగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు దక్కించుకున్నాడు. ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ఏ రేంజ్ లో పోటీ ఉంటుందో అని అందరూ భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకంది.. సైలెంట్ గా ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు రెండోసారి నియామకం అయ్యారు. ఇంత సైలెంట్ గా జరిగిన ఈ పరిణామం వెనుక చక్రం తిప్పింది ఎవరు.. అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.

2024 ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు చాలా సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోయాయి.. రెండోసారి మంచు విష్ణు నియామకం అయ్యారు. ఆదివారం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా మంచు విష్ణుని ఎన్నుకున్నారు.‘మా’ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ని కొనసాగిస్తున్నట్లు 26 మంది కమిటీ సభ్యులు ఏక గ్రీవంగా తీర్మానించారు.ఈ విషయాన్ని ఉపాధ్యక్షుడు మాదాల రవి తెలిపారు. అయితే దీని వెనుక సైలెంట్ గా కథ నడిపింది మంచు విష్ణు కుటుంబ సభ్యులు అని మీడియాలో టాక్ నడుస్తుంది. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా కరాటే కళ్యాణి, ట్రెజరర్ గా శివబాలాజీ ఎంపిక చేశారు. ఈసీ సభ్యులుగా మధుమిత, శైలజ, జైవాణిలను ఎన్నుకున్నారు. వాస్తవానికి ‘మా’ ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ లెక్కన గతేడాది సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది మే నెలకు కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు.

ఇంకో నెలలో ఎన్నికలు సిద్దమవ్వాల్సిన తరుణంలో ‘మా’ జనరల్ బాడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల ‘మా’ ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు. దీని వెనుక మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 2011 లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవడానికి ముఖ్య కారణంగా ఆయన ‘మా’ అసోసియేషన్‌కు నూతన భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు సాగలేదు. ఇంతపెద్ద నగరంలో ఒక అసోసియేషన్ కి బిల్డింగ్ నిర్మించాలంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు. కోట్ల డబ్బుతో కూడుకున్న విషయం.. అందుకే నూతన భవనం నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతుందని మా అధ్యక్షుడు మంచు విష్ణు పలుమార్లు మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాను ఇప్పటికీ అన్న మాటకు కట్టుబడి ఉన్నానని.. ఎట్టి పరిస్థితుల్లో ‘మా’ అసోసియేషన్ కి నూతన భవనం నిర్మించి ఇస్తానని అంటున్నారు.

ఈ క్రమంలోనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఈసారి కూడా మంచు విష్ణు కి అధ్యక్ష పదవి కట్టబెడితే తాను చెప్పినట్లు నూతన భవనం ఏర్పాటు పూర్తయ్యేందుకు వీలు ఉంటుందని భావించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు పోటీ చేసినా ధైర్యంగా ‘మా’ అసోసియేషన్‌కు నూతన భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వలేదు. మంచు విష్ణు ఇప్పటికీ తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని చెప్పినందువల్లనే ఆయనకే మళ్లీ పట్టం కట్టినట్లు వార్తలు వస్తున్నాయి.‘మా’ ఎన్నికలు అంటే ఎప్పుడు గొడవలు, పంచాయతీలు, కొట్లాటలు అన్న పదానికి ఈసారి అర్థం మార్చారు. ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక్కతాటిపై నిలబడటం నిజంగా ఇదో మంచి శుభపరిణామం అని అంటున్నారు.సినీ ప్రముఖులు మంచు విష్ణుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *