Oneplus: మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..?
అయితే ఈ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ ని చూడండి. భారత మార్కెట్లో వన్‌ప్లస్ బ్రాండ్‌కు కి క్రేజ్ మాములుగా ఉండదు. మొదట్లో ప్రీమియం బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన ఫోను ఇది. ఇక పూర్తి వివరాల లోకి వెళ్ళితే.. వన్‌ప్లస్ ఇటీవల బడ్జెట్ ధర లో ఫోన్‌లను లాంచ్ చేస్తూ వుంది. ముఖ్యంగా రూ. 20 వేలలోపు స్మార్ట్ ఫోన్స్‌ను ఇప్పుడు ఈ కంపెనీయే లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి తక్కువ ధరకు ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తన్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా వన్‌ప్లస్ నుంచి మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేయడం జరిగింది.
వన్‌ప్లస్ నార్డ్ ఎన్30ఎస్‌ఈ పేరుతో ఈ ఫోన్ ని తీసుకు రావడం జరిగింది. ఇప్పటికే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ యూఏఈలో లాంచ్ చేసారు. వన్‌ప్లస్ నార్డ్ ఎస్‌ఈ 5జీ ఫోన్ యూఏఈ లో విడుదల చేయడం జరిగింది. ఈ ఫోన్ భారత మార్కెట్లో కి ఎప్పుడు వస్తుందన్న దాని గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ అలానే ధర వివరాలను కూడా చూసేద్దాం. వన్‌ప్లస్ నార్డ్3ఎస్‌ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది వర్క్ అవుతుంది. 2,400 x 1,080 పిక్సెల్స్ తో దీన్ని ఇచ్చారు. డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ విత్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూతో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో లాంచ్ చేశారు. అలానే దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు 300 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కూడా ఇచ్చారు.
కెమెరా వివరాల లోకి వెళితే.. ఈ ఫోన్‌లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డెప్త్ సెన్సార్‌ను ఈ ఫోన్ కి ఇచ్చారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 33 వాట్ సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ బరువు 193 గ్రాములుగా ఉంటుంది. సాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ రంగుల్లో లాంచ్ చేశారు. ధర 599 ఏఈడీలుగా నిర్ణయించారు. మన కరెన్సీలో రూ. 13,600గా ఉండనుంది. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర కాస్త పెరిగే అవకాశాలు వున్నాయి