ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షల(Open School Exams) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది.
2025 మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 28న ముగియనున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెల 17-28 వరకు రోజు విడిచి రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 17వ తేదీన హిందీ, 19న ఇంగ్లీష్(English), 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం, 24వ తేదీన మ్యాథ్స్(Maths), 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం(science and technology), 28న సోషల్ (Social), ఆర్థిక శాస్త్ర(Economics) పరీక్షలు నిర్వహిస్తారు. కాగా రెగ్యూలర్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరుగుతాయి.
ఈ మేరకు ఇప్పటికే SSC బోర్డు పరీక్షల షెడ్యూల్(Exam Shedule)ను ప్రభుత్వాని(Government)కి అందిచింది. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 2025, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఖరారైందని, విద్యార్థులు(Students) ప్రిపేర్ అవ్వడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఈ అదనపు సమయాన్ని అధ్యయనం చేయడానికి, అద్భుతమైన ఫలితాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇప్పటి నుంచి పరీక్షల వరకు ఉన్న విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.