చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి ఒప్పో ఏ3 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ2 ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ మన కరెన్సీలో రూ. 25,000 వరకు ఉండొచ్చని అంచనా. ఇక టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 28,900గా ఉండనుంది.
ఈ ఫోన్‌ను ఐపీ69 రేటింగ్‌తో తీసుకొచ్చారు. దీంతో నీటిలో తడిచినా ఫోన్‌కు ఏం కాదు. అలాగే ఈ ఫోన్లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపైస ఈ ఫోన్ పనిచేస్తుంది
ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం. 360 డిగ్రీ యాంటీ ఫాల్ బాడీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఒప్పో ఏ3 ప్రోలో 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ సొంతం.