ఓరి దేవుడోయ్.. ఐకాన్ స్టార్ ఇంటిలో కూడా అలాంటివి ఉంటాయా.. వైరల్ అవుతున్న లెటేస్ట్ ఫోటోస్..!!

మనం అనుకుంటూ ఉంటాం.. స్టార్ సెలబ్రెటీస్ 1000 కోట్ల ఆస్తికి పైగానే ఉంటుంది.. వాళ్ళింట్లో అన్ని బంగారం వెండితో చేసిన వస్తువులు ఉంటాయి అని .. అయితే ఆ విషయాన్ని తప్పు అంటూ ప్రూవ్ చేశాడు అల్లు అర్జున్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఆయన ఎన్ని కోట్లకు అధిపతుడో కూడా మనకు తెలిసిందే.

 

చిటికేస్తే కొండమీద కోతిని కూడా తన ఇంట్లో వాలే లా చేసుకునే సత్తా ఉన్న హీరో. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో నవారు మంచం ఉండడం ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా ఉంది . జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ అందరూ లక్షలు ఖర్చు చేసి లగ్జరీయస్ మంచాలు కొనుక్కుంటూ ఉంటారు . ఏసి రూముల్లో తప్పిస్తే ఎక్కడా కూడా ఉండరు. అయితే స్నేహ రెడ్డి మాత్రం చాలా డిఫరెంట్ పిల్లలని చాలా జాగ్రత్తగా పెంచుతుంది .

న్యచురల్ గా ఉండాలి అని ఆరు బయట నవారు మంచం వేసి పిల్లలని రిలాక్స్ చేస్తూ ఉంటుంది . దానికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది స్నేహ రెడ్డి . దీంతో ఆమె పేరెంటింగ్ ఫార్ములాకు అభిమానులు ..జనాలు ఫిదా అయిపోతున్నారు. వేలకోట్ల ఆస్తి ఉన్న అల్లు అర్జున్ ఇంట్లో నవారు మంచం ఉందా..? రియల్లీ గ్రేట్ ..నవారు మంచం ఉన్నవాళ్లే తీసి బయట పడేస్తున్న రోజుల్లో అంత పెద్ద స్టార్ సెలబ్రిటీ ఇంట్లో నవారు మంచం ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు. నవారు మంచం పై అల్లు అయాన్ పడుకొని ఉన్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *