ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ ఇదే

ఈ ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక 97వ ఆస్కార్‌ నామినేషన్స్‌ జాబితా ఇవాళ విడుదలైంది. పలు విభాగాల్లో పోటీపడుతున్న చిత్రాల లిస్ట్‌ను లాస్ ఎంజిల్స్‌లో ప్రకటించారు.


గతంలోనే విడుదల కావాల్సిన నామినేషన్స్ చిత్రాల జాబితా.. కార్చిచ్చు ఘటన ఆలస్యమైంది. వాయిదా పడడంతో గురువారం అకాడమీ అవార్డుల నామినేషన్ల చిత్రాల జాబితాను అకాడమీ సభ్యులు బోవెన్ యాంగ్, రాచెల్ సెన్నోట్ ప్రకటించారు.

ఈ సారి ఇండియన్ చిత్రాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. కాగా.. గతంలో రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్‌ నాటు నాటు పాటకు ది బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన షార్ట్ ఫిల్మ్ అనూజకు నామినేషన్స్‌లో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 2న లాస్ ఎంజిల్స్‌లో జరగనున్నట్లు అకాడమీ నిర్వాహకులు ప్రకటించారు. ఆస్కార్‌- 2025 ఎంపికైన చిత్రాల జాబితా మీరు చూసేయండి.

బెస్ట్ పిక్చర్ కేటగిరీ..

అనోరా
ది బ్రూటలిస్ట్‌
ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌
కాన్‌క్లేవ్‌
డ్యూన్‌: పార్ట్‌2
ఎమిలియా పెరెజ్‌
ఐయామ్‌ స్టిల్‌ హియర్‌
నికెల్‌ బాయ్స్‌
ది సబ్‌స్టాన్స్‌
విక్డ్‌

బెస్ట్ డైరెక్టర్ విభాగం..

సీన్‌ బేకర్‌ -(అనోరా)
బ్రాడీ కార్బెట్‌ -(ది బ్రూటలిస్ట్‌)
జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌- (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
జాక్వెస్‌ ఆడియార్డ్‌- (ఎమిలియా పెరెజ్)
కోరలీ ఫార్గేట్‌- (ది సబ్‌స్టాన్స్‌)

బెస్ట్ యాక్ట్రెస్..

సింథియా ఎరివో -(విక్డ్‌)
కార్లా సోఫియా గాస్కన్‌ -(ఎమిలియా పెరెజ్)
మికే మాడిసన్‌ -(అనోరా)
డెమి మూర్‌ – (ది సబ్‌స్టాన్స్‌)
ఫెర్నాండా టోర్రెస్‌- (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)

బెస్ట్ యాక్టర్..

అడ్రియాన్‌ బ్రాడీ- (ది బ్రూటలిస్ట్‌)
తిమోతీ చాలమెట్‌ -(ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
కోల్‌మెన్‌ డొమినింగో- (సింగ్‌సింగ్‌)
రే ఫియన్నెస్‌- (కాన్‌క్లేవ్‌)
సెబస్టియన్‌ స్టాన్‌ -(ది అప్రెంటిస్‌)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్..

మోనికా బార్బరో- (ఏ కంప్లీట్‌ అన్‌నౌన్‌)
అరియానా గ్రాండే -(విక్డ్‌)
జామీ లీ కుర్తీస్- (ది లాస్ట్ షో గర్ల్)
ఇసబెల్లా రోస్సెల్లిని -(కాన్‌క్లేవ్‌)
జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్..

యురా బోరిసోవ్‌ -(అనోరా)
కిరెన్‌ కల్కిన్‌ -(ది రియల్‌ పెయిన్‌)
జెరీమీ స్ట్రాంగ్‌- (అప్రెంటిస్‌)
ఎడ్వర్డ్‌ నార్తన్‌ -(ఏ కంప్లీట్‌ అన్‌నోన్‌)
గాయ్‌ పియర్స్‌- (ది బ్రూటలిస్ట్‌)

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..

ది సబ్‌స్టాన్స్
అనోరా-(సీన్ బేకర్)
ది బ్రూటలిస్ట్-(బ్రాడీ కార్బెట్, మోనా ఫాస్ట్ వోల్డ్)
ది రియల్ పెయిన్(జెస్సీ ఐసన్‌బర్గ్)
సెప్టెంబర్ 5

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ ప్లే..

ఏ కంప్లీట్ అన్‌నౌన్
కాన్‌క్లేవ్
ఎమిలియా పేరేజ్
సింగ్ సింగ్
విక్‌డ్‌

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్..
ఎమిలియా పేరేజ్
ఫ్లో
ఐయామ్ స్టిల్ హియర్
నీ క్యాప్
వర్మింగ్లియో

బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్

ఫ్లో
ఇన్‌సైడ్‌ అవుట్-2
మెమోర్ ఆఫ్ ఏ స్నేయిల్
వాలెస్ అండ్ గ్రామిట్ వెంగేన్స్ ఆఫ్ మోస్ట్ ఫౌల్
ది వైల్డ్ రోబోట్

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
డాటర్స్
నో అదర్ ల్యాండ్
పార్సీలైన్ వార్
సౌండ్ ట్రాక్ టూ ఏ కౌప్ డిటాట్
సుగర్‌కేన్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం..

డెత్ బై నంబర్స్
ఐ యామ్ రెడీ, వార్డెన్
ఇన్సిడెంట్
వన్స్‌ అపాన్ ఏ టైమ్ ఇన్ ఉక్రెయిన్
ఏ స్విమ్ లెస్సన్

బెస్ట్ లైవ్ యాక్షన్‌ షార్ట్ ఫిలిం..
అనూజ(ప్రియాంక చోప్రా చిత్రం)
డోవేకోట్
ది లాస్ట్ రేంజర్
ఏ లైయన్
ది మ్యాన్ వుకుడ్ నాట్ రిమైన సైలెంట్