OTT Movie: బాలుడు రాసే మర్డర్ స్టోరీలు రియల్ కావడంతో తలపట్టుకునే పోలీసులు

మలయాళం చిత్ర పరిశ్రమలో ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు ప్రస్తుతం అత్యధికంగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘కిష్కింద కాండం’, ‘పని’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.


ఈ తరహాలో ఒక పరికరమైన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ చిత్రం పేరు ‘నిజల్’ (Nizhal), ఇది 2021లో విడుదలైన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం ఆహా (Aha) ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు పొందింది. ఇది ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

సినిమా కథ:

‘నిజల్’ చిత్ర కథ జాన్ అనే ప్రధాన పాత్ర చుట్టూ తిరుగుతుంది. జాన్ ఒక కారు ప్రమాదంలో హాస్పిటల్ లో చేరుతాడు. ఆ ప్రమాదం తరువాత అతనికి వర్షం పడుతున్నట్లు అనిపిస్తుంది. జాన్ ఈ పరిస్థితి గురించి ఒక సైకాలజిస్ట్ వద్ద సలహా తీసుకోటానికి వెళ్ళడం ప్రారంభిస్తాడు. సైకాలజిస్ట్ అతనికి గాయాల కారణంగా అలా అనిపిస్తుందని.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే నయం అవుతుందని చెబుతాడు. ఆ తరువాత, జాన్ తన ఫ్రెండ్ రాజన్ దగ్గరకి వెళ్ళి, ఆయన భార్య అయిన సైకాలజిస్ట్ తో తన ఆరోగ్యంపై మాట్లాడుతాడు. ఈ సమయం లో కొందరు చిన్న పిల్లలు చెప్పిన ఫన్నీ స్టోరీలు వింటారు. ఓ పిల్లవాడు మాత్రం మర్డర్ స్టోరీ రాశాడని చెబుతుంది. అది మలయాళంలో ఉంటుంది. ఆ పిల్లవాడికి మలయాళం వచ్చే అవకాశం లేకపోవడంతో జాన్ ఆ పిల్లవాడు చెప్పిన చోటుకు వెళ్ళి పోలీసుల సహాయంతో పరిశీలిస్తాడు. అక్కడ ఓ అస్తిపంజరాన్ని చూస్తారు.

ఈ సమయంలో చిన్న పిల్లవాడు చెప్పిన మరొక కథ కూడా నిజమవుతుంది. జాన్ ఆ పిల్లవాడి చెప్పిన స్టోరీలు నిజం అవుతాయని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో జాన్ ఆ పిల్లవాడి తల్లి అయిన షర్మిల అనే మహిళతో సహాయం తీసుకుంటాడు. అలా ఉండగా ఓ రోజు షర్మిల ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందని వెతుకుతూ ఉంటాడు. నిద్రలో అతని తల్లి షర్మిల కలవరిస్తూ కథ చెబుతుంది. ఆ కథను చిన్న పిల్లవాడు వింటాడు. ఇది తెలుసుకున్న జాన్ ఆశ్చర్యపోతాడు. ఆమె గతాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. షర్మిల భర్త కూడా ఒక ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఈ ఇన్వెస్టిగేషన్లో జాన్ దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి తీసుకొస్తాడు. షర్మిలకి, ఆ హత్యలకి సంబంధం ఉందా? జాన్ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో చాకో బోబన్న, నయనతార నటించారు. అప్పు ఎన్ భట్టతిరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘నిజల్’ చిత్రం ఆహా (Aha) ఓటిటి ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.