OTT Movies: స్టూడెంట్స్ పై టీచర్ ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న రివేంజ్ థ్రిల్లర్..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీలో ఓ రివేంజ్ డ్రామా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.


ది టీచర్.. రెండేళ్ల కిందట థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమా. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాకు డైరెక్టర్ వివేక్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ అమలా పాల్ కథానాయికగా నటించగా… ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె కనిపించింది. 2022 డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఓటీటీ మూవీ లవర్స్ సైతం ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. ఓ టీచర్ తనకు అన్యాయం చేసిన నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్న కథా ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు. పక్క మలయాళం మార్క్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

రెగ్యులర్ రివేంజ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ ది టీచర్ కథ ఉంటుంది. ఇందులో దేవిక అనే టీచర్ పాత్రలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఊహకందని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అయ్యింది. థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈసినిమా ఎక్కువగా నచ్చుతుంది. ఈ సినిమాలో హకీమ్ షా, చెంబన్ వినోద్ జోష్, మంజు పిళ్లై కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికి వస్తే..
దేవిక (అమలా పాల్) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఓ రోజు స్కూల్లో ఈవెంట్ తర్వాత ఆమె తిరిగి ఇంటికి వ్సతుంది. మరుసటి రోజు తన శరీరంపై ఉన్న గాయాలు చూసి షాకవుతుంది. అసలు ఆరోజు తనకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఓ స్టూడెంట్ ఇంటికి వెళ్లగా.. అక్కడ భయంకరమైన నిజం తెలుస్తుంది. తనకు జరిగిన అన్యాయం పై ఆమె ఎలా పోరాడింది.. ? కట్టుకున్న భర్త వదిలేసినా అత్త ఇచ్చిన ధైర్యంతో అన్యాయంపై ఫైట్ చేయడం.. నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నది సినిమా కథ.