మీరు ఇదివరకే అనేక మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసి ఉండొచ్చు. కానీ, మనం చెప్పుకోబోయే ఒక సినిమా మాత్రం వాటిన్నిటికీ మించి, సూపర్ కిక్ ఇస్తుంది.
సాధారణంగా మర్డర్ మిస్టరీ సినిమాలు మిమ్మల్ని కుర్చీ అంచున కూర్చోబెడతాయి. కానీ ఈ సినిమా మిమ్మల్ని కళ్లు ఆర్పకుండా చూసేలా చేస్తుంది, అంత థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. 2 గంటల 16 నిమిషాలు ఉండే ఈ సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్, మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. క్లైమాక్స్ అయితే ఊహించలేనంత షాకింగ్‌గా ఉంటుంది. థ్రిల్లర్ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
ఆ సినిమా పేరు ‘సైలెన్స్… కెన్ యు హియర్ ఇట్?’ (Silence… Can You Hear It?). ఇది 2021 మార్చిలో జీ5 (ZEE5) ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలైంది. ఈ మర్డర్ మిస్టరీలో మనోజ్ బాజ్‌పేయి, ప్రాచీ దేశాయ్, అర్జున్ మాథుర్ ముఖ్య పాత్రల్లో నటించారు. అబాన్ భారుచా డియోహన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ నిర్మించింది.
* కథ విషయానికొస్తే..
ఈ సినిమా ఏసీపీ అవినాష్ వర్మ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో మనోజ్ బాజ్‌పేయి అదరగొట్టాడు. అవినాష్ వర్మ చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్‌లో తనదైన దూకుడు చూపించడం అతనికి అలవాటు. ఒకరోజు, పూజా అనే అమ్మాయి కొండపై హత్యకు గురై విగత జీవిగా కనిపిస్తుంది. పూజ ఎవరో కాదు.. రిటైర్డ్ జస్టిస్ చౌదరి కూతురు. కూతురు కేసు కోసం స్పెషల్ ఆఫీసర్‌ను పెట్టమని ఆయన డిమాండ్ చేస్తాడు. దాంతో రంగంలోకి దిగుతాడు అవినాష్ వర్మ. ఈ మిస్టరీని ఛేదించడానికి అతనికి వారం రోజులే గడువు.
ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుంచి సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడటం మొదలవుతుంది. పూజ హత్యకు ముందు రాత్రి ఒక పొలిటీషియన్ ఇంట్లో గడిపినట్లు తెలుస్తుంది. అనుమానం చాలా మందిపైకి మళ్లుతుంది. కథనం ఊహించని మలుపులు తిరుగుతూ మరింత చిక్కపడుతుంది. అబద్ధాలు, దాగి ఉన్న కారణాలు, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ రైడ్‌లా సాగుతుంది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా ఇంటెన్స్‌గా, స్క్రీన్‌ప్లే అదిరిపోయేలా ఉంటుంది.
* సీక్వెల్ కూడా వచ్చేసింది
మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ కూడా వచ్చింది. దాని పేరు ‘సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్’. ఈ సినిమా 2024 ఏప్రిల్ 16న రిలీజ్ అయింది. మనోజ్ బాజ్‌పేయి, ప్రాచీ దేశాయ్ మళ్లీ తమ పాత్రల్లో కనిపించారు. ఈ సీక్వెల్‌లో కూడా మరో షాకింగ్ మర్డర్ కేసును డీల్ చేస్తారు. ఇది కూడా థ్రిల్లింగ్‌గానే ఉన్నా, మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెప్పగా, మరికొందరు మాత్రం స్లోగా ఉందని అన్నారు. మొదటి సినిమా లాగే దీనికి కూడా IMDbలో 6.5/10 రేటింగ్ వచ్చింది.
* స్ట్రీమింగ్, ఇంపాక్ట్
ఈ రెండు సినిమాలు ZEE5 గ్లోబల్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ పెరగడం వల్ల మనోజ్ బాజ్‌పేయి, పంకజ్ త్రిపాఠి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్‌కి చాలా అవకాశాలు వచ్చాయి. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌తో వాళ్లు ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించడానికి, ఎక్కువ మంది ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి వీలు కలుగుతోంది. ‘సైలెన్స్… కెన్ యు హియర్ ఇట్?’ ఒక పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ. స్ట్రాంగ్ కాస్ట్, ఎంగేజింగ్ స్టోరీతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే.. ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.