PAN Card Inactive: మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్

భారతదేశంలో ఎప్పటికప్పుడు అనేక రూల్స్ మారుతుంటాయి. ఈ క్రమంలో పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డ్ గురించి కీలక అప్‎డేట్ ఉంది. పాన్ ఆధార్ లింకింగ్ గడువు ప్రస్తుతం డిసెంబర్ 31, 2025 వరకు ఉంది.


ఈ సమయం నాటికి పాన్, ఆధార్ లింక్ చేయకపోతే మాత్రం మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. అయినప్పటికీ మీరు మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ (PAN Card Inactive) అయిందని పట్టించుకోకుండా ఇంకా దాన్ని ఉపయోగిస్తే మాత్రం ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) చర్యలు తీసుకుంటుంది.

జరిమానా తప్పదు..

డీ యాక్టివేట్ అయిన పాన్‌ను ఉపయోగిస్తే ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రూ. 10,000 వరకు జరిమానా విధిస్తుంది. పాన్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం మాత్రమే కాదు. ఇది అనేక పన్ను వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ఫైల్ చేయడం, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులు, డిమ్యాట్ ఖాతా వంటి అనేక పనుల కోసం పాన్ కార్డును ఉపయోగిస్తారు. మీరు మీ పాన్ కార్డును యాక్టివ్ గా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

మీ పాన్ కార్డు యాక్టివ్ ఉందో లేదో ఎలా చెక్ చేయాలంటే..

ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ e-ఫైలింగ్ పోర్టల్ కు వెళ్లండి

Quick Links సెక్షన్ లో Verify PAN Statusపై క్లిక్ చేయండి

మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయండి

OTP పొందిన తర్వాత, దానిని నమోదు చేసి, మీ పాన్ స్టేటస్ తెలుసుకోండి

మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అయితే, దాన్ని యాక్టివ్ చేయడం ఎలా?

పాన్-ఆధార్ లింకింగ్ ద్వారా యాక్టివ్ చేసుకోవచ్చు

దీని కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ e-ఫైలింగ్ పోర్టల్ లో Link Aadhaarపై క్లిక్ చేయండి

మీ పాన్, ఆధార్ పై ఉన్న పేరు నమోదు చేయండి

OTP పొందిన తర్వాత, దానిని నమోదు చేసి, పాన్-ఆధార్ లింక్ చేయండి

పాన్, ఆధార్ వివరాలలో తేడాలు ఉన్నట్లయితే, వాటిని సరిచేసి, పాన్-ఆధార్ లింకింగ్ చేయండి

పాన్ కార్డు డీ-యాక్టివేట్ అయినట్లయితే, సంబంధిత ఆధికారికి లేఖ రాసి, పాన్ యాక్టివేషన్ కోసం అభ్యర్థించండి

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎదురయ్యే సమస్యలు

ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయలేరు

పెద్ద మొత్తాల్లో బ్యాంకు లావాదేవీలు చేయడం కష్టం

పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు చేయడంలో ఇబ్బంది

TDS రేట్లు 20% వరకు పెరిగిపోతాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.