టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందనుకున్న డబ్బు తిరిగి పొందాడు. సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్ వాలెట్ పాస్‌వర్డ్ కంప్యూటర్‌లో భద్రపరిచాడు.
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందనుకున్న డబ్బు తిరిగి పొందాడు. సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్ వాలెట్ పాస్‌వర్డ్ కంప్యూటర్‌లో భద్రపరిచాడు. తర్వాత అతని కంప్యూటర్‌లో వైరస్ చేరడంతో ఆ పాస్‌వర్డ్ గల్లంతయింది. పాస్‌వర్డ్ లేకపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయాడు. 2013లో తన వాలెట్‌లో తక్కువ బిట్‌కాయిన్‌లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్‌కాయిన్‌లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.
ఇటీవల బిట్‌కాయిన్ విలువ ఒక్కసారిగా పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్‌కాయిన్‌లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ ‘జో గ్రాండ్’ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్ రికవర్ చేసాడు. దశాబ్ద కాలంలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ అనూహ్యంగా పెరిగి సుమారు 3 మిలియన్ కోట్ల డాలర్లకు అంటే 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి.