Pawan Kalyan: జగన్ అహంపై పవన్ ‘చిరు’ అస్త్రం

www.mannamweb.com


Minister Pawan Kalyan: జగన్ అహంపై పవన్ ‘చిరు’ అస్త్రం

Minister Pawan Kalyan: గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన సాగించారు జగన్. 151 సీట్లతో గెలిచేసరికి విజయ గర్వంతో ఊగిపోయారు. తన ప్రతి నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తారని భావించారు.

తన మాటకు ఎదురు తిరగరని అంచనా వేశారు. అమరావతి ఏకైక రాజధానికి అందరూ ఆమోదముద్ర వేస్తే.. తాను మాత్రం మూడు రాజధానులు అంటూ విభిన్నంగా ఆలోచించారు.అందుకే 166 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అమరావతికి జై కొట్టారు. మూడు రాజధానులు వద్దు అంటూ తేల్చి చెప్పారు. చివరకు రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్ర ప్రజల సైతం తిరస్కరించారు. విశాఖ నగరవాసులు కనీసం ఆహ్వానించలేదు. పైగా భారీ ఓటమితో బదులు చెప్పారు.

అధికారంలో ఉండగా అన్ని అనుకూలతలు కనిపిస్తాయి. ప్రధాని మోదీ ఆహ్వానిస్తారు. అవకాశం ఇచ్చారు. కూర్చోబెట్టి చర్చించారు. చాలా రకాల మినహాయింపులు ఇచ్చారు. అది ఒక దేశ పాలకుడిగా.. ప్రతి రాష్ట్ర పాలకుడికి ఇచ్చే మినహాయింపు. కానీ తనకు రాష్ట్రంలో తిరుగులేదు.. జాతీయస్థాయిలో ఎదురు లేదు అన్నట్టు భావించారు. కానీ అన్నింటికీ సమాధానం ఇచ్చారు ఏపీ ప్రజలు. పవన్ అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా జగన్కు దీటైన బదులిచ్చారు. అటు పదేళ్ల అభిమానుల నిరీక్షణకు అసలుసిసలు ఫలితం ఇచ్చారు.అదే సమయంలో చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అదే చిరంజీవిని జగన్ అవమానించిన తీరుకు గట్టిగానే బదులిచ్చారు పవన్.

చంద్రబాబు తో పాటు పవన్ ను ఆశీర్వదించారు ప్రధాని మోదీ. వారికి శుభాకాంక్షలు చెబుతున్న క్రమంలోనే తన అన్న చిరంజీవి ప్రస్తావని తీసుకొచ్చారు పవన్.మోడీ సైతం ఒక వైపు పవన్ ను, మరోవైపు చిరంజీవిని పక్కన పెట్టుకుని కూటమి విజయ గర్వాన్ని అనుభవించారు. చిరంజీవి స్థాయి ఏమిటో, ఆయన స్థానం ఎక్కడుందో తెలిసి వచ్చేలా చేశారు పవన్. నలుగురు మధ్య చిరంజీవికి చేసిన అవమానాన్ని.. కోట్లాదిమంది సాక్షిగా బదులిచ్చారు పవన్. సినీ పరిశ్రమ సమస్యలపై పెద్దన్న పాత్ర పోషిస్తూ చిరంజీవి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. నాడు అధికార మదంతో జగన్ వ్యవహరించిన తీరు, అదృశ్య కెమెరాల్లో బంధించి మరి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో లక్షలాదిమంది మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. అందుకే ఇప్పుడు పవన్ రివెంజ్ తీర్చుకున్నారు. అటు కుటుంబ విలువలను సైతం జగన్ కు తెలియజెప్పారు పవన్. ఓటమితో కష్టంలో ఉన్నప్పుడు అవమానాలను తాను ఒక్కడినే భరించాడు పవన్. కానీతనకు దక్కిన విజయం,గౌరవంలో మాత్రం అన్న చిరంజీవికి వాటా ఇచ్చాడు. అసలు కుటుంబ విలువలు అంటే ఇవి కదా జగన్ అని సోషల్ మీడియాలో ప్రశ్నలు, నిలదీతలు ఎదురయ్యేలా చేశాడు పవన్.