కొత్త ఏడాదిలో ప్రజలు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడతారు.. భయాన్ని రేకెత్తిస్తోన్న వంగా జ్యోస్యం

2025 కి ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నప్పటికీ..కొత్త సంవత్సరం 2026 లో ఏమి జరుగుతుందో అనే చర్చ మొదలైంది. ఈ సమయంలో బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వాంగా చేసిన ఒక ప్రవచనం కూడా ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది.


బాబా వంగాను నమ్మేవారికి.. భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా క్యాష్ క్రష్ లేదా నగదు కొరత చోటుచేసుకుంటుందని ముందుగానే చెప్పారని అంటున్నారు.

లాడ్‌బైబుల్ ప్రకారం బాబా వంగా 2026 లో తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేసింది. డిజిటల్, భౌతిక ద్రవ్య వ్యవస్థలు రెండూ కూలిపోతాయని ఆమె అంచనా వేసింది. ఇది ‘నగదు క్రష్’కు దారితీస్తుంది. ఈ సంక్షోభం బ్యాంకింగ్ సంక్షోభాలు, కరెన్సీ విలువ తగ్గింపు, మార్కెట్ ద్రవ్యత తగ్గింపులు వంటి సంఘటనలకు దారితీయవచ్చు. ఇది ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు , టెక్ పరిశ్రమలో అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

అయితే ఆర్థికవేత్తలు బాబా వంగా కొత్త ఏడాది కోసం వేసిన అంచనాలను తోసిపుచ్చారు. అయితే ఇటీవలి మార్కెట్ అస్థిరత, భారీ సాంకేతిక తొలగింపులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చాలామంది ఈ సమయాన్ని అసాధారణంగా భావిస్తున్నారు.

ప్రపంచ సంఘర్షణ పెరుగుదల

2026 లో అంతర్జాతీయ సంఘర్షణ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని బాబా వంగా కూడా అంచనా వేశారు. కొందరు దీనిని మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన జోస్యంగా భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు , రష్యా-అమెరికా వివాదం, చైనా-తైవాన్ ఘర్షణల దృష్ట్యా వంగా అంచనా నిజమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె అణు యుద్ధం గురించి స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ.. ‘ప్రపంచవ్యాప్తంగా వివాదాల’ గురించి ఆమె హెచ్చరిక 2026లో జరగనున్న పరిణామాల పట్ల ఆందోళనను తీవ్రతరం చేసిందని లాడ్‌బైబుల్ నివేదిక జోడించింది.

బాబా వాంగా మరో ముఖ్యమైన ప్రవచనం కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా ఉంది. బాబా వంగా ప్రవచనాలు కృత్రిమ మేధస్సు, బాహ్య అంతరిక్షం గురించి కూడా ప్రస్తావించాయని స్కై హిస్టరీ నివేదించింది. 2026 లో AI మానవ వ్యవస్థలపై నియంత్రణను సాధిస్తుందని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పింది. అయితే ఇది మానవ జీవితాన్ని సులభతరం చేసినా.. ఆర్థిక అసమానతలను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు నవంబర్ 2026 లో భూమిపై ఉన్న ప్రజలు గ్రహాంతర జీవులను సంప్రదిస్తారని ఆమె అంచనా వేసింది. ఒక “పెద్ద అంతరిక్ష నౌక” భూమికి దగ్గరగా వస్తుందని ఆమె అంచనా వేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ అంచనని శాస్త్రవేత్తలు ఎగతాళి చేస్తున్నారు.

ఇప్పటివరకు బాబా వాంగా చేసిన సెప్టెంబర్ 11 దాడులు, బ్రెగ్జిట్, 2004 సునామీ వంటి అనేక అంచనాలు నిజమయ్యాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. దీంతో బాబా వాంగా 2026 చేసిన అంచనాలు నిజమవుతాఏమో లేదో కాలమే నిర్ణయించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.